'ఖుషి'కి, విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక హీరో టీమ్?
విజయ్ దేవరకొండ - సమంత కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సినిమా విడుదలైన మొదటిరోజు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండురోజుల్లోనే రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.
ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఒకవైపు దూసుకుపోతుండగా, మరోవైపు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఇలా ప్రచారం చేయడానికి కొంతమంది పనిచేస్తున్నారనే వాదనను విజయ్ అభిమానులు తెరపైకి తెచ్చారు. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో విజయ్ నటించి ఖుషి సినిమా బాగోలేదని చెబుతూ వన్ బై టెన్ రేటింగ్స్ పదివేల వరకు నమోదయ్యాయి.

అవి నిఖార్సుగా వచ్చినవి కాదని, బాట్స్.. అని ఆటోమేటిక్ గా సిస్టంద్వారా మ్యానిప్యులేట్ చేసి తక్కువ రేటింగ్స్ ఇచ్చి సినిమా రేటింగ్ ను తక్కు చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారని రౌడీహీరో అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ సినిమా చూసి నచ్చకపోతే ఇలాంటి రేటింగ్ ఇచ్చిన పర్వాలేదని, కానీ పనిగట్టుకొని కొంతమంది ఇలా చేస్తున్నారని, వారిని సహించేదిలేదని హెచ్చరిస్తున్నారు. దీనివెనక ఒక ప్రముఖ హీరో టీమ్ ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ హీరో ఎవరనే విషయంలో స్పష్టత రాలేదు. నిజంగానే బుక్ మై షోకి ఇలాంటి తప్పుడు రేటింగ్ ఇచ్చారా? లేదా? అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. 10వేల ఫేక్ రేటింగ్స్ కనుక ఇస్తే దీనివెనక ఎవరో భారీస్థాయిలో కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోందంటున్నారు.












Click it and Unblock the Notifications