శ్రీలీలను వేధిస్తున్న స్టార్ హీరో?

సినీ పరిశ్రమలో ఎప్పుడు, ఎవరు, ఎలా విజయవంతమవుతారో చెప్పలేం. అదంతా అదృష్టం మీద ఆధారపడివుంటుంది. కొందరు బ్లాక్ బస్టర్ హిట్లిచ్చి కనుమరుగైపోతారు.. మరికొందరు సాదా సీదాగా పరిశ్రమలోకి వచ్చి స్టార్ గా మారిపోతారు. ప్రస్తుతం హీరోయిన్ శ్రీలీల క్రేజ్ పరిశ్రమలో నడుస్తోంది. ఆమె చేతిలో ఒకటికాదు.. రెండు కాదు.. మూడు కాదు.. 12 ప్రాజెక్టులున్నాయి. అన్ని సినిమాలున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే శ్రీలీల అనే అందరూ చెబుతున్నారు.

కనుమరుగైన ఇతర హీరోయిన్లు : శ్రీలీల ధాటికి స్టార్ హీరోయిన్లు సైతం కనుమరుగైపోతున్నారు. అందుకు ఉదాహరణ పూజా హెగ్డే. వరుసగా ఫ్లాప్స్ రావడంతో అందరూ శ్రీలీలవైపు దృష్టిసారించారు. దర్శకులు, నిర్మాతలే కాదు.. హీరోలు కూడా శ్రీలీల కావాలని అడుగుతున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. తన డేట్లు ఎప్పుడు ఖాళీగా ఉన్నాయో చూసుకొని అప్పుడు షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు కొందరు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సినిమాలో మొదటి హీరోయిన్ లేదంటే రెండో హీరోయిన్ గా పెట్టుకోవడానికైనా దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారంటే ఆమె అదృష్టమని చెప్పవచ్చు.

who is that star hero harassing to heroine sreeleela

ఫోన్ చేసి టార్చర్ : అటువంటి పొజిషన్ లో ఉన్న శ్రీలీలను తన సినిమాలో నటించాలంటూ కన్నడ స్టార్ హీరో ఒకరు అడిగారు. అయితే అతని క్యారెక్టర్ గురించి తెలిసిన శ్రీలీల తనకు కరెక్ట్ కాదని ఆలోచించి ఖాలీలేదని చెప్పింది. ఆమె ఫోన్ నెంబరు తీసుకొని ఫోన్ చేస్తూ, మెసేజ్ లు పంపిస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. తనతో సినిమా చేయడానికి ఒప్పుకోకపోతే ఇలాగే టార్చర్ పెడతానని బెదిరిస్తున్నాడంట. దీంతో శ్రీలీల పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కన్నడ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఎవరా స్టార్ హీరో అని అందరూ ఆరాతీస్తున్నారు. శ్రీలీల తీసుకున్న నిర్ణయం సరైందేనని కొందరు అంటున్నారు.. మరికొందరేమో ఆమె స్పందించాలంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+