AP DGP షాకింగ్ కామెంట్స్.. అందుకే కోర్టుకు అలా తీసుకెళ్లాం..!!
ఏపీలో నేరస్థులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో నిందితులకు ఇస్తున్న ట్రీట్‌మెంట్ చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా వైసీపీ నేతలకు, కార్యకర్తలకు, ఓవర్ యాక్షన్ చేసే రప్పా రప్పా బ్యాచ్ కు బ్యాండ్ బాజా చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు చూసిన పలువురు పోలీసుల శైలిపై విమర్శలు సైతం గుప్పించారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు నేరస్థులను నడిపించుకుంటూ కోర్టులకు తీసుకువెళ్తున్నారు. వివిధ పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వారికి బుద్ధి చెప్పే విధంగా, నేరాలకు పాల్పడిన వారు సిగ్గు పడే విధంగా తమదైన స్టైల్ లో ముందుకు వెళ్తున్నారు.
దీనిపై సోమవారం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్షిక నివేదిక సైతం విడుదల చేశారు. గణంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం హత్యలు, అత్యాచారాలు, దాడులు, మహిళలపై నేరాలు వంటివి తగ్గినట్లు మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆర్థిక నేరాలు, హత్యాయత్నాలు, పగటిపూట ఇళ్లు కొల్లగొట్టడాలు వంటి ఘటనలు పెరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మొత్తంగా అన్ని రకాల నేరాలు కలిపి 2024 కంటే 2025లో 6.17 శాతం మేర తగ్గడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో శిక్షలు 6.51 శాతం మేర పెరిగాయని స్పష్టం చేశారు

'వార్షిక నేర గణాంక నివేదిక-2025' విడుదల చేసి ఆ వివరాలు వెల్లడించిన అనంతరం రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఊహించని షాక్ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. మీరు ఈ మధ్య నిందితులను రోడ్లపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకువెళ్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అని అడగ్గా... " మా దగ్గర నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి పెట్రోలింగ్ వాహనాలు లేవు. అందుకే మేము వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లాము. మేము కూడా వారితో పాటే నడిచాము" అంటూ బదులిచ్చారు. దీంతో సీరియస్ గా సాగుతున్న సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు చిందించారు అక్కడున్న అధికారులంతా.
ఏపీ డీజీపీ : మా దగ్గర నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి పెట్రోలింగ్ వాహనాలు లేవు. అందుకే మేము వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లాము. మేము కూడా వారితో పాటే నడిచాము.#APDGP #Harishkumargupta #UANow pic.twitter.com/bQEesBddS2
— UttarandhraNow (@UttarandhraNow) December 29, 2025
అయితే దీనిపై వైసీపీ తీవ్రంగా మండిపడుతుంది. తమ అధినేత జగన్ ఎక్కడైనా పర్యటిస్తే అడ్డుకోవడానికి.. అక్కడికి వచ్చే నాయకులను అరెస్ట్ చేయడానికి ఉంటున్న వాహనాలు.. నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి మాత్రం ఎందుకు లేవని ప్రశ్నించారు. ప్రజలు ఎవరైనా సమస్యలతో రెడ్డెక్కితే వారిని వెంటనే అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించడానికి మిని బస్సులు, డీసీఎం లారీలు ఏర్పాటు చేస్తున్న పోలుసుల.. నిందితులను కోర్టుకు తీసుకెళ్లడానికి మాత్రం వాహానాలు లేవంటూ సాకులు చెప్తారా అంటూ నిలదీశారు.












Click it and Unblock the Notifications