ఎపికి అన్యాయం: మోడీ ధీమా అదేనా, అమిత్ షా ప్లాన్?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తే పుట్టగతులుండవని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు బిజెపిని శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేయడం వల్లనే కాంగ్రెసు అధికారాన్ని కోల్పోయిందని వారు హెచ్చరిస్తున్నారు.

  TDP-Congress Alliance : Sonia Gandhi's Support To TDP

  కాంగ్రెసు గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయినట్లే వచ్చే ఎన్నికల్లో బిజెపి తుడిచి పెట్టుకుని పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. కానీ, బిజెపి పెద్దల ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తోస్తోంది. ఏమీ లేని చోటు పోయేదేందీ, వచ్చేదేందీ అనే ఆలోచన వారికి వచ్చినట్లు కనిపిస్తోంది.

  గత ఎన్నికల్లో చంద్రబాబు వల్ల

  గత ఎన్నికల్లో చంద్రబాబు వల్ల


  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జత కట్టడం వల్ల ఎక్కువగా లాభపడిందని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని బిజెపి జాతీయ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో చంద్రబాబు మిత్ర ధర్మానికి తూట్లు పొడవడం వల్లనే తమకు కేటాయించిన సీట్లలో ఓటమి పాలయ్యామని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటివారు అంటున్నారు.

  కాంగ్రెసుకు ఇదే కాబట్టి..

  కాంగ్రెసుకు ఇదే కాబట్టి..

  కాంగ్రెసు కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టని కోటగా ఉంటూ వచ్చింది. రాష్ట్ర విభజన వల్ల అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెసు ఓడిపోయి కేంద్రంలో కూడా అధికారాన్ని కోల్పోయింది. దానికితోడు, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి అనుకూల వాతావరణం ఏర్పడడం కూడా దానికి మరో కారణం.

  బిజెపి విషయానికి వస్తే...

  బిజెపి విషయానికి వస్తే...

  బిజెపి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు ఇద్దరే. దానివల్ల బిజెపికి పెద్దగా ఒరిగింది కూడా ఏమీ లేదు. అందువల్ల చంద్రబాబు తెగదెంపులు చేసుకుంటే బిజెపికి జరిగే నష్టమేమీ లేదు.

  పైగా వారంతా ఉన్నారు...

  పైగా వారంతా ఉన్నారు...


  చంద్రబాబు తమతో తెగదెంపులు చేసుకుంటే పూర్తి స్థాయిలో లోకసభ స్థానాలకు బలమైన అభ్యర్థులను దింపడానికి అవకాశం కూడా ఉంటుందని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ వంటివారిని బరిలోకి దింపితే ఆ మాత్రం గెలుచుకోవడానికి అవకాశం లేకపోలేదనే అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. పైగా కేంద్రంలో తాము అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని కూడా బిజెపి భావించడం లేదు.

  అవసరమైతే జగన్‌తో పోవచ్చు...

  అవసరమైతే జగన్‌తో పోవచ్చు...


  ఎన్నికులు ముగిసిన తర్వాత అవసరమైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎన్డీఎ కూటమిలోకి తీసుకోవచ్చుననే అంచనా కూడా బిజెపికి ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు వచ్చినా మళ్లీ మిత్రపక్షంగా మార్చుకోవచ్చునని అనుకుంటుండవచ్చు. మరో వైపు పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. అందువల్ల ఎన్నికలు ముగిసిన తర్వాత ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీని తమ కూటమిలో చేర్చుకోవచ్చునని కూడా భావిస్తున్నారు.

  అందువల్లనే ఇలా...

  అందువల్లనే ఇలా...

  ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబును బలోపేతం చేయడం ద్వారా నష్టపోయేది తామేనని, చంద్రబాబు మరింతగా బలపడితే తాము బలపడేందుకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లుతాయని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, చంద్రబాబు కేంద్ర పథకాలకు తన పేర్లు పెట్టుకుంటున్నారనే విమర్శలను ఓ వైపు సంధిస్తూ మరోవైపు రాష్ట్రానికి ఇవ్వాల్సినంత ఇవ్వకపోవడం కారణమని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  According to political analysts - BJP has valid reasons in ignoring Andhra Pradesh state and for cornering Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి