పోలవరంలో చేతులు పెడితే కాలుతాయి, బిజెపి మోసం, ఏపీపై పగ: చంద్రబాబు సంచలనం
అమరావతి:ఏపీకి న్యాయం చేస్తారని బిజెపితో పొత్తు పెట్టుకొంటే మిత్రపక్షం తమను మోసం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చేతులు పెడితే కాలిపోతాయని బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సంక్షోభంగా అభివర్ణించారు. తన రాజకీయ జీవితంలో మూడో సంక్షోభాన్ని చూస్తున్నానని బాబు చెప్పారు.
మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా బిజెపిపై మరోసారి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరడం తప్పా అంటూ బాబు ప్రశ్నించారు.

మూడో సంక్షోభాన్ని చూస్తున్నా
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనను పదవి నుండి తప్పించిన సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన చరిత్ర రాష్ట్ర ప్రజలకు ఉందని బాబు గుర్తు చేశారు. ఆగష్టు సంక్షోభం తర్వాత రాష్ట్ర విభజన అనే సంక్షోభాన్ని కూడ తాను చూశానని చంద్రబాబునాయుడు గుర్తు చేసుకొన్నారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను మూడో సంక్షోభంగా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

పోలవరంలో చేతులు పెడితే కాలిపోతాయి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కూడ అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. నీతి ఆయోగ్ సిపారసు మేరకు పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని బాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో లాలూచీ పడినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు విమర్శించారు. రాష్ట్ర విభజనకు ముందే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు అప్పగించారని చెప్పారు. అయితే కేంద్రం సూచన మేరకే నవయుగ కంపెనీ పనులను అప్పగించినట్టు ఆయన చెప్పారు. పోలవరం విషయంలో కొందరు చేతులు పెట్టాలని చూస్తున్నారని, అలా చేతులు పెడితే కాలిపోతాయని బాబు విరుచుకుపడ్డారు.

ఏపీ అంటే ఎందుకంత పగ
ఏపీ రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే ఉద్దేశ్యంతోనే బిజెపితో పొత్తును పెట్టుకొన్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే మిత్రపక్షంగా ఉన్న బిజెపి కూడ తమను మోసం చేసిందని ఆయన చెప్పారు. ఏపీకి పదేళ్ళ పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర విభజన సమయంలో బిజెపి కోరలేదా అంటూ బాబు ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రానికి దక్కాల్సిన హక్కుల కోసం పోరాటం చేస్తోంటే యుద్దం ప్రకటిస్తారా అంటూ బిజెపి నేతలను బాబు ప్రశ్నించారు.

ఎన్నో అవమానాలు పడ్డాను
ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో 29 సార్లు ఢిల్లీకి వెళ్ళినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కానీ, రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రం సహకరించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కోసం అనేక ఇబ్బందులు పడ్డానని చెప్పారు. అనేక అవమానాలను కూడ పంటిబిగువన ఓర్చుకొన్నానని బాబు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో హేతు బద్దత పాటిస్తే ఈ కష్టాలు వచ్చేవి కావని బాబు చెప్పారు.
-
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications