బాబుపై విరుచుకుపడ్డ వంగవీటి రాధా, తాత వయస్సు చంద్రబాబు.. అన్నా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నోరు ఎందుకు ఎత్తడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వంగవీటి రాధాకృష్ణ సోమవారం నాడు ప్రశ్నించారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సభకు తొలుత తమకు అనుమతించి, ఆ తర్వాత వెనక్కి తగ్గారని ఆరోపించారు. ఎస్వీయూలో వైసిపి సభకు కావాలనే అనుమతి నిరాకరించారన్నారు. తమ పార్టీ సందేశం యువతలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎస్వీయూలో సభ జరిపి తీరుతామన్నారు.

Why Chandrababu is silent on Special Status issue?: Vangaveeti Radha

తాత వయస్సులో ఉన్నాడు.. చంద్రన్నా ఏంటి: అమర్నాథ్

చంద్రన్న రైతు యాత్ర పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ నేత అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ తాత వయసులో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్న కోసం చంద్రన్నగా అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు.

విజయనగరలోని భోగాపురం విమానాశ్రయం భూసేకరణ పైన ధ్వజమెత్తారు. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అని చెప్పి ఉత్తరాంధ్రలో గ్రీన్ ఫీల్డ్ లేకుండా చేస్తున్నారన్నారు. అన్ని మండలాల్లో భూముల విలువలను పెంచిన ప్రభుత్వం భోగాపురం వచ్చేసరికి ఎందుకు సవరించలేదన్నారు.

రైతుల పొలాలు తీసుకుని చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చిన గ్రామాలను వదిలి మిగతా గ్రామాల్లో భూమి సేకరించడం సమంజసం కాదని అమర్నాథ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+