పవన్ కళ్యాణ్‌ను పిలిచి ఎందుకు అడగలేదు!: హోదాపై జగన్ పార్టీ
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన, జెపి నేతృత్వంలోని లోక్‌సత్తా, తమ పార్టీని పిలిచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు సూచనలు అడగలేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు గురువారం ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాకు ఇచ్చేందుకు ఉన్న గైడ్ లైన్స్ ఏపీకి వర్తించవన్నారు. ప్రత్యేక హోదా కాకుండా.. ప్రత్యేక హోదాను ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.
విభజన కోరుకోని ప్రజలకు ఇచ్చిన భరోసానే ప్రత్యేక హోదా అన్నారు. ఢిల్లీల్లో పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటేసిన ప్రజలను వంచిస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చి, ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు.
ఏడాది కాలంలో కనీసం వారు ప్రత్యేక ప్యాకేజీ గురించి అడగలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదా ఒక్కటేనని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజల తరఫున పోరాడాల్సిన చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు.

ఏపీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన కోడ్ ఫర్ ఏపీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని మన వద్దకు తీసుకురావాలన్నారు. తమ ప్రభుత్వం ఇన్‌క్యుబేషన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. మనకు అవసరమైన వస్తువులు మన వద్దే తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications