ప్రపోజ్ చేసిన వెంటనే అమ్మాయిలు ఎందుకు ఒప్పుకోరో తెలుసా?

ప్రేమ ఎప్పుడు ఎవరి మనసులో పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే ఒకసారి ప్రేమ పుట్టిందంటే అది దక్కేవరకు అవతలివాళ్లు ప్రయత్నిస్తారు. ప్రేమను వ్యక్తపరిచే విషయంలో అబ్బాయిలే ముందుంటారు. చాలామంది అమ్మాయిలు మాత్రం తమ మనసులో అబ్బాయిపట్ల ప్రేమను కలిగివుంటారుకానీ ధైర్యంగా వ్యక్తం చేయలేరు. దీనికి ఒక కారణం ఉంది. ముందుగా ప్రేమను వారు ఎందుకు ఒప్పుకోరో తెలుసుకుందాం.

proposal

* అమ్మాయిల మనసులో అబ్బాయిలంటే ఎక్కువ ప్రేమ ఉన్నప్పటికీ ముందుగా చెప్పరు. అబ్బాయిలే ముందుగా చెప్పాలి.

* చాలా సందర్భాల్లో అబ్బాయిలే తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అమ్మాయి మాత్రం ప్రేమను ఒప్పుకుంటే సమాజం ఏమనుకుంటుందో అని భయపడుతుంది. ప్రజలు ఆమె ప్రవర్తన గురించి మాట్లాడే అవకాశం ఉండటంతో అమ్మాయిలు తమ ప్రేమను చెప్పడానికి వెనకాడతారు.

* అమ్మాయిలు ప్రేమను ఒప్పుకోవడానికి వెనకాడతారు కాబట్టి అబ్బాయిలే మొదట వారి ప్రేమను ప్రపోజ్ చేసేవరకు వేచివుంటారు.

* అమ్మాయిలు అబ్బాయిల విషయంలో ఇష్టపడతారు. వారికి తగిన అబ్బాయి కోసం వెతుకుతారు. తన వ్యక్తిత్వానికి సరిపోయే ఆదర్శవంతమైన అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. దీంతో అబ్బాయి మంచివాడా? కాదా. అని నిర్ణయించుకోవడానికి అధిక సమయం తీసుకుంటారు.

proposal

* మనం ఇష్టపడే అబ్బాయి మనపై ఆసక్తి చూపకపోతే తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అబ్బాయిలు తమ ప్రేమను తిరస్కరించి వదిలేస్తారేమో అని అమ్మాయిలు భయపడుతుంటారు. ఎంత ప్రేమ ఉన్నప్పటికీ చెప్పడానికి వెనకాడతారు.

* ప్రేమ విషయంలో వివాదాలు జరగడం సహజం. ఇలా గొడవలు జరిగితే అబ్బాయిలు తమవైపు వేలెత్తి చూపుతారనే భయం నెలకొంటుంది. మొదట ప్రేమను వ్యక్తపరిచి ఇప్పుడు గొడవ పడుతున్నావా? అని ప్రశ్నిస్తారేమోననే భయం వల్ల ప్రపోజ్ చేసిన వెంటనే ఒప్పుకోరు. ఈ భయాలేవీ లేకుండా పోతే అప్పుడే ప్రేమించినవారి చెంతకు చేరతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+