బాబును కేసీఆర్ ఇబ్బంది పెడుతుంటే.. జగన్ తమాషా చూస్తున్నారా?

విజయవాడ: కృష్ణా నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుంటే ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తమాషా చూస్తున్నారా? అంటే టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఇతర తెలుగు తమ్ముళ్లు అవుననే అంటున్నారు.

కృష్ణా నీటి సమస్య విషయంలో తెలంగాణ - ఏపీ మధ్య, ఇరు రాష్ట్రాల మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, హరీష్ రావుల మధ్య, ఇరు రాష్ట్రాల నేతల మధ్య నిన్నటి వరకు వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైయస్ జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు.

దీనిని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మనకు ఇబ్బందికర పరిణామాలు సృష్టిస్తున్న కేసీఆర్ పైన జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ సీఎంకు వ్యతిరేకంగా ఆయన ఏం మాట్లాడటం లేదన్నారు.

 'Why Is Jagan silent, When KCR is troubling AP?'

అదే సమయంలో, ఏపీ అభివృద్ధిని జగన్, వైసిపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేశారని, చేస్తున్నారని అంటున్నారు. కానీ కృష్ణా నీటి పైన మాత్రం తెరాసను అనడం లేదంటున్నారు.

కాగా, వైయస్ జగన్ పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారమే ఆయన విమానాశ్రయంలో కనిపించారు. ఆయన తిరుగు ముఖం పడుతున్నట్లుగా ఉంది. పర్యటన అనంతరం ఆయన తిరిగి రాజకీయంగా బిజీ కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+