బాలయ్యకు అభిమానుల షాక్: ఎందుకీ దూరం.. అసంతృప్తి రాజుకుందా?
జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు ఆనం బ్రదర్స్, నగర టీడీపీ కార్పోరేటర్లు
నెల్లూరు: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పట్ల నెల్లూరు అభిమానులు అసంతృప్తితో ఉన్నారా?.. బాలకృష్ణ కార్యక్రమం ఏదైనా సరే.. ముందుండే అభిమానులు ఈసారి మాత్రం ఎందుకు దూరంగానే ఉండిపోయారు. నుడా ఛైర్మన్ గా కోటంరెడ్డి నియామకం పట్ల వారికేమైనా అభ్యంతరాలున్నాయా?.. చొరవ తీసుకుని మరీ ఆయన్ను గెలిపించినందుకు బాలకృష్ణపై అభిమానులు గుర్రుగా ఉన్నారా?..
బాలకృష్ణ సమక్షంలో శనివారం నాడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నుడా(నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఛైర్మన్ గా నియమితులైన నేపథ్యంలో.. ఈ ప్రశ్నలకు తెర పైకి రావడం గమనార్హం. జిల్లా నుంచి నుడా ఛైర్మన్ పదవి కోసం చాలామందే పోటీపడినప్పటికీ.. బాలయ్య సిఫారసుతో కోటంరెడ్డి ఎన్నిక ఖరారైపోయింది.
అయితే నుడా ఛైర్మన్ గా కోటంరెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి.. బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అభిమానులు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దివంగత ఎన్టీఆరో్ నుంచి నందమూరి కుటుంబానికి ఫ్యాన్స్ అసోసియేషన్లను నిర్వహిస్తున్న నేతలు ఈ కార్యక్రమానికి రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.

అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, ఆయన భార్య అనురాధ, వారి వర్గం మొత్తం దీనికి దూరంగా ఉన్నారు. వీరితో పాటు బాలయ్య అభిమాన సంఘ అధ్యక్షుడు కిన్నెర బ్రదర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో బాలయ్య అభిమానులు ఆయనపై గుర్రుగా ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు ఆనం బ్రదర్స్, నగర టీడీపీ కార్పోరేటర్లు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.












Click it and Unblock the Notifications