'చంద్రబాబు కంటే కేసీఆర్ పాలన భేష్.. ఇదీ పవన్ నమ్మకం, త్వరలో ఆయనేంటో తేలుస్తుంది'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలో పరిపాలన బాగుందని భావించినందు వల్లే జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రశంసించారని జనసేన ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

మూడో కన్ను: మోడీపై బాలకృష్ణ, బీజేపీ మరో 'ఆపరేషన్ గరుడా', బయటపెడతా: శివాజీ సంచలనం

ప్రస్తుతం రాజకీయాలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ రాజకీయం సాగుతోందన్నారు. అందుకు నిదర్శనం ఇదే అన్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య కక్ష సాధింపు రాజకీయాలు జరిగాయన్నారు.

Why Pawan Kalyan praising Telangana CM KCR?

కానీ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అలా చేయబోరని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కంటే తెలంగాణలో కేసీఆర్ పాలన బాగుందని పవన్ నమ్ముతున్నారని చెప్పారు.

అందువల్లే కేసీఆర్‌కు ఆరు పాయింట్లు, చంద్రబాబుకు రెండు పాయింట్లు ఇచ్చారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయే రాజకీయ నేత అని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారని, కానీ ఆయన ఏమిటో త్వరలోనే నిజం తెలుస్తుందని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Why Jana Sena chief Pawan Kalyan praising Telangana Chief Minister K Chandrasekhar Rao?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X