Vijay Cabinet: విజయ్ కేబినెట్ లో మంత్రులు వీళ్లే..? ఇద్దరు మహిళలకు చోటు..!

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న రెండు కూటములను ఎదుర్కొని మట్టి కరిపించిన విజయ్ (Vijay) ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ఆవిర్బవించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాసిన విజయ్.. ఇప్పుడు కేబినెట్ (Cabinet) మంత్రుల్ని సిద్దం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ మేరకు కీలక నేతలతో జాబితా సిద్దం చేసినట్లు సమాచారం.

Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!
Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!

మంత్రివర్గ కూర్పుపై ఇవాళ టీవీకే పార్టీ సీనియర్ నేతలతో విజయ్ చర్చలు జరుపుతున్నారు. ఇందులో పలువురు సీనియర్లు తమకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం విజయ్ కేబినెట్లో చోటు కోరుకుంటున్నారు. అయితే కేబినెట్ సమతూకంలో ఉండేలా పలు వర్గాలకు చోటివ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరు మహిళలకు సైతం అవకాశం ఇవ్వబోతున్నారు.

TVK Chief Vijay Moves Fast on Cabinet Formation Probable Ministers List Revealed
TVK-Congress Alliance: కాంగ్రెస్, ఇతర పార్టీలకు విజయ్ ఆఫర్ చేస్తున్న శాఖలివే..!
TVK-Congress Alliance: కాంగ్రెస్, ఇతర పార్టీలకు విజయ్ ఆఫర్ చేస్తున్న శాఖలివే..!

టీవీకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కీర్తన, విజయలక్ష్మికి విజయ్ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే ఆనంద్, సెంగొట్టయన్, ఆదవ్ అర్జున, నిర్మల్ కుమార్, అరుణ్‌రాజ్, విజయ్ శరవణన్, తమిళన్ పార్తీబన్, మొహమ్మద్ పర్వేజ్, కల్లానైలకు విజయ్ కేబినెట్‌లో స్థానం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో చేరే కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు మంత్రులు, ఇతర చిన్న పార్టీలకు తలో బెర్త్ చొప్పున విజయ్ కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+