నంద్యాల, కాకినాడలో టిడిపి గెలిస్తే ఉద్యమాన్ని ఆపేయాలా?: ముద్రగడ
కిర్లంపూడి: 2018లోనే ఎన్నికలు వస్తే బాగుంటుందని, అప్పుడు 13 జిల్లాల్లోని కాపు జాతి సత్తా ఏంటో చూపుతారని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన కాపు ఉద్యమాన్ని ఆపేయాలా? అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు.
ఈ గెలుపును పండగ చేసుకోవాలని చంద్రబాబు పిలుపునివ్వడాన్ని ముద్రగడ తప్పుబట్టారు. ఈ మేరకు సోమవారంనాడు కిర్లంపూడిలోని తన ఇంట్లో ముద్రగడ మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రాలేదని, అప్పుడు పార్టీని గంగలో కలిపేయ లేదు కదా? అని విమర్శించారు.

అలాంటప్పుడు ఎన్నికల్లో టీడీపీ గెలిచినంత మాత్రాన కాపు ఉద్యమం ఆపేయాలా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చెప్పిన ప్రకారం చంద్రబాబు కాపు రిజర్వేషన్లకు పట్టం కట్టాలన్నారు.
తాను జగన్‌కు అమ్ముడు పోయానని ఆరోపించడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగాను అవమానించడం సరికాదని ముద్రగడ అన్నారు. ''ఆ రోజు ఆయనయ్యాడు.. రేపు నేనవుతాను.. చనిపోయిన వ్యక్తి మీద రాళ్లు వేయడం, అభాండాలు మోపడం సరికాదు'' ముద్రగడ అభిప్రాయపడ్డారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications