చిలిపి పనులు చేయండి.. జీవితం రొమాంటిక్ గా మారుతుంది
దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే రొమాంటిక్ టచ్ ఉండాల్సిందే. దంపతులిద్దరూ కస్సుబుస్సు లాడుకున్నా సరసాలు కూడా ఉంటేనే ఆ జీవితం సంతోషంగా ఉంటుంది. సరసాలు కూడా ఎప్పటిలా కాకుండా కొత్తగా ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం మన దినచర్యకు కొన్ని అలవాట్లను జోడించాలి. తద్వారా రోజును సంతోషంగా ప్రారంభించవచ్చు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఓపెన్ గా మాట్లాడటంతోపాటు ప్రేమను పంచడంతోపాటు ప్రశంసలు కూడా తెలియజేయాలి. దీనివల్ల ప్రేమ, విశ్వాసం, మద్దతుతో బంధం మరింత బలపడుతుంది.
ఉదయం నిద్ర లేవగానే ఇద్దరూ గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి. అలాగే వీడ్కోలు చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది దినచర్యలో ఒక భాగమైతే మీ సంబంధం అర్థవంతంగా మారుతుంది. టీ, కాఫీ, టిఫిన్ లాంటివి కలిసి తీసుకోవాలి. దీనివల్ల రోజంతా సంతోషంగా గడుస్తుంది. రోజువారీ బిజీ షెడ్యూల్స్ ను ప్రారంభించాలంటే ఒకరితో మరొకరు సమయాన్ని గడపడానికి అనుమతిస్తుంది.

భార్య వంట చేస్తుంటే కాస్తంత సాయం చేయాలి. చిలిపి పనులు చేస్తుంటే జీవితం కొత్తగా సాగుతుంది. ప్రేమగా తట్టడం, భుజాలపై చేతులు వేయడం లాంటివి గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. నేనున్నానంటూ ఒక భరోసా కల్పిస్తుంది. ఎటువంటి కష్టం వచ్చినా తనకంటూ ఒక తోడుందనే భావన పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం పూట కాస్తంత ప్రేమను జోడిస్తే రంగురంగులుగా ఉంటుంది జీవితం. వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు తోడుగా, చేదోడు వాదోడుగా నిలుస్తుంటే రంగులనావగా జీవన పనయనం సాగుతుంది.












Click it and Unblock the Notifications