రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడని.. భర్త కళ్లలో కారం కొట్టిన ఇల్లాలు ! ఎందుకంటే ?
గుడివాడ : భార్య, భర్తల మధ్య గొడవ జరిగింది. అలిగిన భర్త వేరుగా ఉంటున్నాడు. ఇదే అలుసుగా తీసుకున్న భార్య .. మరొకరితో సహజీవనం చేస్తోంది. ఈ విషయం తెలిసిన భర్త .. ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దాడిచేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన గుడివాడలో జరిగింది.

వివాహేతర సంబంధానికి దారితీసిన అలక ..
గుడివాడలోని వాంబేకాలనీలో కోసూరు మురళీకృష్ణ దంపతులు ఉంటున్నారు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త వెంట్రప్రగడలో విడిగా ఉంటున్నారు. అలిగిపోయిన భర్తను సముదాయించి .. తీసుకురావాల్సిన భార్య, అలా చేయలేదు. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏ కొండూరు మండలం చీమలపాడుకి చెందిన ఉగ్గా గోకరాజుతో సహజీవనం చేస్తోంది.

కత్తితో దాడి గాయాలు, కారం చల్లిన భార్య
తన భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసి రగిలిపోయిన మురళీకృష్ణ సమయం కోసం ఎదురుచూశాడు. వారిద్దరూ కలిసి ఉన్నారని తెలుసుకొని వాంబే కాలనీలోని ఇంటికెళ్లాడు. అప్పటికీ తనతోపాటు తెచ్చుకున్న కత్తీతో దాడిచేశాడు. దీంతో గోకరాజు ఛాతిభాగం, కంటిపై తీవ్రగాయాలయ్యాయి. భార్యపై దాడి చేద్దామనుకునేలోపు కళ్లలో కారం చల్లి ప్రియుడితో సహా పారిపోయింది.

బండికి నిప్పు
తన భార్య ప్రియుడితో కలిసి పారిపోవడంతో మురళీకృష్ణ మరింత ఆగ్రహానికి గురయ్యాడు. గోకరాజుకు చెందిన పల్సర్ బండికి నిప్పు పెట్టి దహనం చేశాడు. మురళీ చేతిలో గాయపడ్డ గోకరాజును ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. మురళీపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసినట్టు ఎస్సై టీవీ వెంకటేశ్వరరావు తెలిపారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications