గదిలో యువతితో భర్త: అలా కానిస్టేబుల్ గుట్టురట్టు చేసిన భార్య
తన భర్త ప్రియురాలితో ఉండగా ఓ భార్య ఆయన బాగోతాన్ని బయటపెట్టింది. అయితే అదంతా తనపై కుట్రతో చేసిందని ఆ భర్త వాపోతున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది.
విశాఖ: తన భర్త ప్రియురాలితో ఉండగా ఓ భార్య ఆయన బాగోతాన్ని బయటపెట్టింది. అయితే అదంతా తనపై కుట్రతో చేసిందని ఆ భర్త వాపోతున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది.
తాను తప్పుచేయలేదని, స్నేహితురాలు తన సమస్యను చెప్పుకునేందుకు ఇంటికి వస్తే కుట్రపన్ని అక్రమ సంబంధం అంటగట్టారని కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్ చెప్పారు.

ప్రసాద్‌కు దుర్గతో వివాహం
గాజువాకలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ప్రసాద్‌కు 2014లో దుర్గతో వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు అరిలోవలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ పాప పుట్టి చనిపోయింది. అయితే కొద్దికాలంగా భర్త ప్రసాద్ ప్రవర్తనలో మార్పు గమనించింది దుర్గ. ఇంటికి సరిగా రాకపోవడం, ప్రతి విషయానికి చిరాకు పడటం చేసేవాడని అంటున్నారు.

భర్త గురించి ఆరా
రెండేళ్లు వీరి కాపురం సాగింది. 2016 నుంచి వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ప్రసాద్ భార్యను ఆరిలోవలోని పుట్టింట్లో వదిలేసి ప్రహ్లాదపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. భర్త ఎక్కడ ఉన్నాడో తెలియని దుర్గా అతని గురించి ఆరా తీయగా, ప్రహ్లాదపురంలో ఉంటున్నట్టు సమాచారం వచ్చింది.

మహిళతో భర్త, తలుపులు వేసి
ఒంటరిగా ఉంటున్నాడా లేక మరో మహిళతో ఉన్నాడా అని దుర్గ రహస్యంగా పరిశీలించింది. శనివారం ఓ మహిళ ప్రసాద్ ఇంటికి వచ్చింది. భర్త, ఆ మహిళ ఇంట్లో ఉండగా దుర్గ తలుపులు వేసి తాళం వేసేసింది. వెంటనే మీడియాకు, స్థానికులు, పోలీసులకు సమాచారం అందించింది. పెద్దఎత్తున జనం గుమిగూడారు.

నన్ను చూసుకోవడం లేదని
పోలీసులు అక్కడికి చేరుకుని గదిలో ఉన్న కానిస్టేబుల్‌ని, మహిళను బయటకు తీసుకు వచ్చారు. ఇరువర్గాలను గోపాలపట్నం పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి విచారించారు. తనను వివాహం చేసుకున్నప్పటి నుంచి సరిగా చూసుకోవడంలేదని, కట్నం కోసం వేధిస్తున్నాడని దుర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కౌన్సెలింగ్ ఇస్తామన్న పోలీసులు
భార్య దుర్గ తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని, ఆమె ఎప్పుడూ తనను అనుమానిస్తూ ఉండేదని కానిస్టేబుల్ ప్రసాద్ సీఐకి తెలిపారు. కుటుంబ వ్యవహారం కావడంతో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. వాస్తవాలను పరిశీలించి కానిస్టేబుల్ తప్పుచేసినట్టు నిరూపణ అయితే చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications