భర్తను హత్య చేసిన భార్య, ఎందుకంటే?

చిత్తూరు:చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలకేంద్రంలో వ్యాపారి గణేశన్ హత్య సంచలనం సృష్టించింది. భర్తను తానే హత్య చేశానని గణేశన్ భార్య పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. అయితే తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని భార్య చెప్పారని పోలీసులు చెప్పారు.

శాంతిపురం మండలకేంద్రీంలో గణేశన్ హత్య కలకలం రేపుతోంది. గణేశన్ ఆరేళ్ళుగా కిరాణా వ్యాపారం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. గణేషశన్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే గణేశన్ నుభార్య ఎందుకు హత్య చేసిందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాపారంలో కూడ గణేశన్ కు ఎలాంటి ఇబ్బందులు లేవని కూడ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఈ తరుణంలో గణేశన్ ను అత్యంత దారుణంగా హత్య చేయడం పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు.

wife kills husband in chittoor district

గణేశన్‌ అతని భార్య మాధవి దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే, మాధవి ఉదయం కుప్పం పొలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయింది. అయితే తాను తన భర్త గణేశన్ ను హత్య చేసినట్టుగా ఆమె పోలీసులకు చెప్పారు. గణేశన్ శరీరంపై పలు కత్తిపోట్లు ఉండటాన్ని గుర్తించారు.

గణేశన్ మృతదేహం లభించిన ప్రాంతంలో పోలీసులు క్లూస్‌టీమ్ ఆధారాలను సేకరించింది. గణేశన్ ను భార్యే హత్య చేసేంతగా వారిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏమిటనే దిశగా కూడ పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే కుటుంబసభ్యులతో పాటు, ఇతరులతో గణేశన్ కు ఏమైనా గొడవలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.ఈ కేసులో అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+