ఈ ఘోరాలు ఆగవా.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య.. ఈసారి ఏపీలో !

వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా...
ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు కర్మ కాలి ఆలి అంటేనె భద్రకాళి
కళ్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా
నీ కొంప ముంచేస్తుందిరా.. ఆపుకోలేని నీ తొందరా
డోంట్ మ్యారి బి హ్యాపీ.. డోంట్ మ్యారి బి హ్యాపీ

ఇన్నాళ్లు ఈ పాటని ఏదో కామెడీ కోసమో.. ట్రోల్ చేయడం కోసమో పాడితే సరదాగా నవ్వుకునే వాళ్లు. కానీ ఇప్పుడు జరుగుతున్న వరుస ఘటనలను చూస్తుంటే మాత్రం ఇవి కేవలం లిరిక్స్ లాగా కాదు.. అక్షర సత్యాల్లాగా కనిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న యువకుల గుండెల్ని భయం బెంబేలెత్తిస్తుంది.

ప్రస్తుతం సమాజంలో మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయి. ఈ మాయ రోగం వచ్చిందో తెలియదు కానీ.. పవిత్రమైన వివాహ బంధాన్ని కాలరాస్తూ కామంతో కళ్లు మూసుకుపోయి.. నేరాలకు పాల్పడుతున్నారు. ఇన్నాళ్లు వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను కడతేర్చుతున్న మృగాళ్లు ఓ పక్కన ఉంటే.. మరోవైపు ఇప్పుడు కొత్తగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వారినే కాటికి పంపుతున్నారు కొందరు మహిళలు.

wife-kills-husband-with-boyfriend-in-ananthapur-for-extra-marital-affair

మొన్న మేఘాలయ హనీమూన్ కేసు.. నిన్న తెలంగాణలో జరిగిన మర్డర్ కేసు ఇందుకు ఉదాహరణలు అయితే ఇప్పుడు ఈ ఘాతుకం ఆంధ్రప్రదేశ్‌లో కూడా చోటు చేసుకుంది. ప్రియుడితో భర్తను హత్య చేయించింది ఓ భార్య. ఏపీలోని అనంతపురం సమీపంలో జరిగిన దారుణ హత్య కేసులో నిందితులను ఆరు గంటల్లోపు పట్టుకున్నారు పోలీసులు.

ఈ దారుణ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అక్కంపల్లిలో గ్రామంలో నివసిస్తున్న సురేష్‌బాబు(43) మంగళవారం నాడు హత్యకు గురయ్యాడు. కేవలం ఆరు గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఈ ఘటనలో భార్యే అసలు సూత్రధారి అని గుర్తించారు. ఈ కేసులో సురేష్‌ భార్య అనిత (37), ఆమె ప్రియుడు ఫక్రుద్దీన్‌(34)ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

సురేష్‌బాబు స్థానిక కల్యాణదుర్గం రోడ్డులో ఓ చిన్న హోటల్‌ నడుపుతున్నాడు. అతడి భార్య అనిత కూడా మొదట్లో ఓ హోటల్‌లో పనిచేసేది. ఈమెకు రెండు నెలల కిందటే బాబా ఫక్రుద్దీన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే అనిత, బాబా ఫక్రుద్దీన్‌ల మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. సురేష్‌కు ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో ఆమెను తరచూ తాగొచ్చి వేదింపులకు గురిచేసేవాడు. తనను అనుమానిస్తుండటం, అదే సాకుతో వేధిస్తుండటం వంటి విషయాలన్నీ అనిత తన ప్రియుడు ఫక్రుద్దీన్‌కు చెప్పింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతున్న భర్తను ఎలాగైనా చంపితే ఇద్దరం సంతోషంగా ఉండొచ్చని ప్రియుడిని ఉసిగొల్పింది.

wife-kills-husband-with-boyfriend-in-ananthapur-for-extra-marital-affair

ఈ మేరకు ప్రతిరోజు రాత్రి హోటల్‌ మూసేసి తన భర్త టూవీలర్‌పై ఇంటి కుస్తాడని.. ఆ సమయంలో చంపాలని సలహా ఇచ్చింది. అందుకు అంగీకరించిన బాబా ఫక్రుద్దీన్‌.. వ్యాపారం నిమిత్తం మార్తాడు గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో అతడికి ఫోన్‌ చేసిన అనిత.. ఎలాగైనా తన భర్తను ఈరోజు చంపాలని సూచించింది. దీంతో హోటల్‌ మూసేసి.. రాత్రి 11 గంటల సమయంలో బైక్‌పై వస్తున్న సురేష్‌బాబుపై.. బాబా ఫక్రుద్దీన్‌ దాడి చేశాడు. అందుబాటులో ఉన్న సీసాను సురేష్‌బాబుపై విసిరేయడంతో బైక్ పై నుంచి కిందకు పడిపోయాడు. వెంటనే అతడిపై ఫక్రుద్దీన్‌ దాడి చేసి తన వెంట తీసుకెళ్లిన స్క్రూడ్రైవర్‌తో పొడిచి ఆ తర్వాత బండరాయితో బాది హత్య చేసినట్టు విచారణలో తేల్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారైనట్టు వెల్లడించారు.

అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు పర్యవేక్షణలో సీఐ శేఖర్ ఆధ్వర్యంలో.. ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దిగి ఈ కేసును చేధించి నిందితులను పట్టుకున్నట్టు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+