వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ ట్యాపింగ్ పరికరాలపై వికీలీక్స్ సంచలనం: చిక్కుల్లో పడిన చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వికీలీక్స్ సంచలన విషయాన్ని బయటపెట్టింది. సెల్‌ఫోన్లు, ఈ మెయిల్ సమాచారాన్ని దొంగచాటుగా ట్యాప్ చేసే టెక్నాలజీని సమకూర్చుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా యత్నించారని తెలిపింది. ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కన్సల్టెన్సీ సంస్థద్వారా బేరసారాలు నడిపింది. సుమారు 7.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ టెక్నాలజీ కొనుగోలుకు సిద్ధమైందనే విషయాన్ని వికీలీక్స్ వెల్లడించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మెయిళ్లు, సెల్‌ఫోన్ల సంభాషణలపై నిఘాపెట్టి ట్యాపింగ్ చేసే టెక్నాలజీని అమ్మే సంస్థలు అనేకం ఉన్నాయి. ఉగ్రవాద, తీవ్రవాద కార్యకలాపాల మీద నిఘాకోసమంటూ ఈ సంస్థలు అమ్మే సాఫ్ట్ట్‌వేర్‌ను చట్టవ్యతిరేక పనుల్లో వాడుతున్నారు. ఇలా అక్రమంగా హ్యాక్ చేసిన సుమారు 10 లక్షల ఈమెయిళ్లను వికీలీక్స్ శుక్రవారం బయటపెట్టింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారం బయటుపడింది. సదరు టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఓర్టస్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థతో సంప్రదింపులు నడిపారు.

Chnadrababu Naidu

వీరికోసం ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ కాసు ప్రభాకర్‌రెడ్డి ఇలాంటి టెక్నాలజీని విక్రయించే హాకింగ్‌టీమ్.కామ్ అనే సంస్థతో బేరసారాలు జరిపారు. 25నుంచి 50 సెల్‌ఫోన్ల నంబర్లపై ట్యాపింగ్ జరిపేందుకు టెక్నాలజీ కావాలని హాకింగ్‌టీమ్‌కు ఆర్డర్ చేశారు. ఇందుకు సంబంధించిన ఈ-మెయిళ్లు శుక్రవారం వెలుగు చూశాయి.

ప్రాథమికంగా ఏడున్నర కోట్ల రూపాయలు చెల్లించి ఆ టెక్నాలజీని అమ్మేందుకు కన్సల్టెన్సీ జరిపిన సంప్రదింపుల కేబుళ్లను వికీలీక్స్ బయటపెట్టింది. బయటపడ్డ కేబుళ్లలోని సమాచారం ప్రకారం జూన్ 12న ఓర్టస్ కంపెనీ డైరెక్టర్ ప్రభాకర్ సింగపూర్‌లోని హాకింగ్ టీమ్ సింగపూర్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ చీఫ్ డేనియల్ మగ్లిట్టాతో ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపారు.

వికీలీక్స్ వివరాల ప్రకారం - ఏపీ పోలీసులకు అత్యవసరంగా సెల్యులార్ ఇంటర్‌సెప్షన్ హార్డ్‌వేర్ కావాలని ఆర్డర్ చేశారు. ఏ అవసరాలకోసం దాన్ని వినియోగించదలిచింది వివరాలను ఆయన ఈ మెయిల్‌కు జత చేశారు. టెక్నాలజీకి సంబంధించి అనేక సందేహాలతో కూడిన ప్రశ్నావళిని హాకింగ్ టీమ్‌కు పంపించారు. అంచనాగా ఒక ధర ఎంతో చెబితే తాను తన క్లయింట్ (ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్)కు చెప్పి ఆ మొత్తం సమకూర్చేందుకు యత్నిస్తానని ప్రభాకర్‌రెడ్డి ఆ మెయిల్‌లో స్పష్టం చేశారు. హాకింగ్ టీమ్‌కు సంబంధించిన ఇతర టెక్నాలజీ కొనుగోలుకు సైతం యత్నిస్తానని హామీ ఇచ్చారు.

సుమారు 20నుంచి 50 మ్బైల్ లైసెన్స్‌లు అర్జంటుగా కావాలని అందులో కోరారు. దీనిపై స్పందించిన హాకింగ్‌టీమ్ ప్రతినిధి మగ్లిట్టా, ప్రభాకర్‌రెడ్డి పంపిన ప్రతిపాదనను పరిశీలించినట్టు ధృవీకరిస్తూ ఆయన కోరిన సాప్ట్‌వేర్ కావాలంటే ఉజ్జాయింపుగా సుమారు 7.5 కోట్ల రూపాయలు అవుతుందని, అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు. ఒకసారి క్లయింట్ (ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్)ను కలిస్తే ఇంకా ఇతర విషయాలు మాట్లాడవచ్చని ప్రతిపాదించారు. జూన్ 16, 17 తేదీల్లో కూడా స్కైప్‌లో ఇద్దరూ సంభాషించుకున్నారు.

English summary
In a revelation that could deeply embarrass the Chandra Babu Naidu government in AP, leading whistleblower organization WikiLeaks revealed that AP Government is negotiating with vendors in USA, to purchase phone tapping equipment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X