వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై ఇంత నాటకమా? భాగం కాలేం: కాంగ్‌పై బిజెపి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Will BJP to support Telangana Bill unconditionally?
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో అధికార కాంగ్రెసు పార్టీ పైన ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ అసహనం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి మంత్రుల బృందానికి(జివోఎం)కు ఘాటైన లేఖ రాస్తూ పార్టీ తరఫున ప్రత్యేకంగా నివేదిక పంపేందుకు విముఖత చూపుతున్నట్లుగా సమాచారం. కాంగ్రెసు పార్టీ తీరు పైన బిజెపి నేతలు మండిపడుతున్నారు.

విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ ఆడుతున్న నాటకంలో తాము భాగం కాలేమని, ఆ పార్టీ రెండు నాల్కల ధోరణి సరికాదని, ప్రజలను మోసగిస్తూ ఇతర పార్టీల అభిప్రాయాలు ఎలా అడుగుతారని జివోఎంకు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. విభజనకు తాము మద్దతిస్తామని అయితే, విభజన అనంతరం ఏం చేస్తారో ముందు తేల్చాలని డిమాండ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

పార్టీల నుండి నివేదికలు కోరిన కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలోని యూపిఏ ప్రభుత్వం.. అదే కాంగ్రెసు పార్టీ ప్రాంతాల వారీగా నివేదికలు పంపి చేతులు దులుపుకోవడమేమిటని బిజెపి మండిపడుతోంది. సమస్యను పరిష్కరించాల్సిన స్థానంలో ఉన్న కాంగ్రెసు పార్టీయే రెండు నివేదికలు పంపి మోసం చేస్తున్నప్పుడు తాము ఏ నివేదక పంపకూడదని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

విభజన విషయంలో కాంగ్రెసు పార్టీకి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగ్, బొత్స సత్యనారాయణలు తలోరకంగా మాట్లాడటం ఆ పార్టీలోనే ముందు సమన్వయం లేదని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి నాటకంలో తాము భాగస్వాములం కాలేమని జివోఎంకు ఘాటైన లేఖ ద్వారా చెప్పనున్నట్లు తెలుస్తోంది.

బిజెపి హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు కట్టుబడి ఉందని, సాధ్యమైనంత త్వరగా బిల్లు తెస్తే మద్దతిస్తామని మాత్రం లేఖలో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాదుతో కూడిన తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లుగానే సీమాంధ్రుల్లోని భయాందోళనలు, అక్కడి ప్రజల ఆకాంక్షలు తీర్చాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. గురువారం పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర నేతలతో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు.

English summary

 The BJP national leadership had made it clear that the Bill for creation of Telangana would be supported unconditionally by the party in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X