బ్రహ్మానందం పొలిటికల్ ఎంట్రీ, పవన్ కళ్యాణ్‌తో చర్చలు?

తన రాజకీయ ఆరంగేట్రం పైన బ్రహ్మానందం జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రెండుసార్లు చర్చించినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో టాలీవుడ్ టాప్ నటులు రాజకీయాల వైపు ఎక్కువగా చూస్తున్నారు. అందులోను గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ హవా కారణంగా ఆ పార్టీ వైపు ఎక్కువగా చూస్తున్నారు.
అయితే, తన రాజకీయ ఆరంగేట్రం పైన బ్రహ్మానందం చెప్పాల్సి ఉంది. అది ఎంత వరకు నిజమో ఎంత వరకు అబద్దమో తెలియాల్సి ఉంది. ఇటీవల పలువురు రాజకీయాల వైపు చూస్తున్నందున నటుల ప్రతి అడుగును మీడియా క్షుణ్ణంగా గమనిస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి.. బిజెపికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. మరో టాప్ హీరో నాగార్జున కూడా సోమవారం సాయంత్రం మోడీతో భేటీ అయ్యారు. కాగా, తాను రాజకీయాల్లో ప్రవేశించనని గతంలో బ్రహ్మానందం చెప్పారు.












Click it and Unblock the Notifications