సూర్యుడు పుట్టక ముందే చంద్రుడు అరెస్టు, ఉప్పు తింటే నీళ్లు తాగాలని సామెత !

విజయవాడ/తిరుపతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు ప్రజలు నివాసం ఉంటున్న రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యింది.

చంద్రబాబు నాయుడు అరెస్టు కావడానికి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు సమర్థించుకుంటున్నారు. సీఐడీ పోలీసులు చట్టపరంగా వాళ్ల పనివాళ్లు చేసుకుంటున్నారని, ఉప్పు తిన్న తరువాత కచ్చితంగా నీళ్లు తాగాలని, ప్రజల సోమ్మును స్వాహా చేసిన చంద్రబాబును ఇప్పుడు సీఐడీ పోలీసులు అరెస్టు చేశారని వైసీపీకి చెందిన కొందరు మంత్రులు అంటున్నారు.

Will Chandrababu Naidus arrest be a plus point for TDP? Will it be favorable for YCP?

మా నాయకుడు చంద్రబాబుఎలాంటి తప్పు చెయ్యలేదని, జగన్ ప్రభుత్వాన్ని, ఆయన అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు పోలీసులను, ఐపీఎస్ అధికారులను అడ్డం పెట్టుకుని చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులను అరెస్టు చేశారని ఆ పార్టీ నాయకులు అరోపిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే చట్టపరంగా శిక్షించాలని, అయితే ప్రజల్లో తిరుగుతున్న ఆయన శుక్రవారం రాత్రి నంద్యాలలో జరిగిన బహిరంగ సభకు హాజరు అయిన తరువాత హడావిడిగా ఆయన్ను శనివారం తెల్లవారు జామున అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏముందని, ఉదయం అందరి సమక్షంలో అరెస్టు చేసి ఉంటే ఎలాంటి సమస్యలు ఉండేవాడది కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Will Chandrababu Naidus arrest be a plus point for TDP? Will it be favorable for YCP?

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్టు కలకలం రేపింది. ప్రజలు సోమ్మను స్వాహా చేసిన మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కచ్చితంగా జైలుకు పోతారని వైసీపీ నాయుకులు గట్టిగా చెబుతున్నారు. స్కిల్ స్కామ్ కేసులో మళ్లి నిధులు పూర్తిగా చంద్రబాబు నాయుడికి అందాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అయితే రెండు ఏళ్ల క్రితం నమోదు అయిన ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు నాయుడి పేరు ఇరికించి ఆయన్ను ఇబ్బంది పెట్టడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు తీరు టీడీపికి ప్లస్ పాయింట్ అవుతుందా ?, చంద్రబాబును అవినీతిపరుడు అని ఆరోపిస్తున్న వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతందా అని వేచి చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+