బాబుకు షాక్: రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా?

హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి అరెస్టు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారా అనే చర్య రాజకీయవర్గాల్లో సాగుతోంది. అయితే, తన పేరు కూడా తెర మీదికి రావడంతో చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తొలుత ఈ వ్యవహారంపై టివి ఛానళ్లలో వచ్చిన వార్తలు చూసి తేలికగా టిడిపి అధిష్టానం తీసుకున్నా, టీవీ చానెళ్లు ప్రసారం చేసిన వీడియోలతో కంగు తిన్నాయి.

తెలంగాణ నాయకులకు వెంటవెంటనే పార్టీ కార్యాలయం నుండి ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుండే ఎసిబి వర్గాలు రేవంత్‌రెడ్డిని ట్రాక్ చేస్తూ ఆడియో-వీడియో దృశ్యాలను రికార్డు చేస్తూ వచ్చారని సమాచారం. ఆ విషయం తెలియని టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఎదురుదాడికి దిగి ఈ వ్యవహారం నుండి బయటపడవచ్చని మొదట భావించారు. దాంతో రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతూ కెసిఆర్ కుట్రగా అభివర్ణిస్తూ ప్రకటనలు చేశారు.

టీవీ చానెళ్లలో వీడియోలు ప్రసారం కావడంతో డొంక కదిలిందనేది అర్థం కావడంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ముందుకు సాగడం దుర్లభంగా మారి, వెనకడుగు వేస్తూ వచ్చారు. రేవంత్ ఎసిబికి దొరికిపోవడం ఒక ఎత్తయితే, రేవంత్ ఈ వీడియోల్లో చేసిన వ్యాఖ్యలు టిడిపి వర్గాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇందులో రేవంత్ పదే పదే మా బాస్..అంటూ వ్యాఖ్యానించడంతో టిడిపి అధినాయకత్వం ఇరకాటంలో పడింది.

Will Chandrababu take action against Revanth Reddy

బాస్ అంటే ఎవరు? జాతీయ అధ్యక్షుడిని ఉద్ధేశించి మాట్లాడారా? లేదా యువనేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా? లేదా టిడిపిలో ఎవరైనా ఇతర నాయకులను దృష్టిలో ఉంచుకుని మాట్లాడారా అనే మీమాంసలో టిడిపి వర్గాలు పడ్డాయి. బాబు అంటూ కూడా ఓసారి ప్రస్తావన వచ్చింది. గత పక్షం రోజులుగా రేవంత్‌రెడ్డి వ్యవహారాలపై గట్టి నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. రేవంత్‌కు వచ్చిన ఫోన్లు, సంభాషణలను సైతం రికార్డు చేసినట్టు సమాచారం. పరిస్థితికి అనుగుణంగా కోర్టు ముందు దశల వారీ ఎసిబి ఈ రికార్డులను సమర్పించనున్నట్టు తెలుస్తోంది.

ఈ స్థితిలో రేవంత్‌పై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలా? లేదా రెండు మూడు రోజులు పరిస్థితిని అంచనా వేయాలా అనే మీమాంసలో పార్టీ పడిపోయింది. రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా చేసిన పనిగా ఏకాకిని చేసి పార్టీ నుండి బహిష్కరించడం ఉత్తమమని కొంతమంది సూచిస్తుండగా, ఏకాకిని చేస్తే పార్టీ పెద్దనేతలను సైతం ఈ వ్యవహారంలోకి లాగే ప్రమాదం ఉందని మరికొంతమంది సూచిస్తున్నారు. శనివారం, ఆదివారం చాలా బిజీగా గడిపిన పార్టీ అధినేతకు ఇదో పెద్ద షాక్‌గా చెబుతున్నారు. దగ్గరలో ఉన్న నేతలను ఇంటికి పిలిపించుకున్న చంద్రబాబునాయుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిసింది.

చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకులే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందా అనే ఆలోచనలో కూడా పడినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+