సినీ గ్లామర్ చంద్రబాబును గట్టెక్కిస్తుందా? (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి సినీ గ్లామర్ బోలెడు ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి సినీ గ్లామర్ ఆ పార్టీకి ఎక్కువే. సినీ దిగ్గజం ఎన్టీ రామారావు పార్టీని స్థాపించడం వల్ల కావచ్చు, ఇతరేతర కారణాల వల్ల కావచ్చు తెలుగుదేశం పార్టీకి సినీ ప్రముఖులు మొదటి నుంచి అండగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి పెద్దయెత్తున సినీ ప్రముఖులు రంగంలోకి దిగుతున్నారు. హిందూపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు.

కాగా, పవన్ కళ్యాణ్ కూడా టిడిపి తరఫున ప్రచారం చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరుపుతున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ రాకతో జూనియర్ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బాలయ్య

ఇప్పటికే బాలయ్య

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి బావమరిది, నందమూరి హీరో బాలకృష్ణ ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయారు. ఆయన శాసనసభకు పోటీ కూడా చేస్తున్నారు.

తారకరత్న కూడా...

తారకరత్న కూడా...

మరో నందమూరి హీరో తారకరత్న కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన తన బాబాయ్ బాలయ్య పోటీ చేస్తున్న హిందూపురంలో ప్రచారం చేస్తున్నారు.

వేణుమాధవ్ తురుపుముక్క

వేణుమాధవ్ తురుపుముక్క

తెలంగాణకు చెందిన హాస్యనటుడు వేణు మాధవ్ చంద్రబాబుతో చేతులు కలిపారు. తెలంగాణలో ఆయన చంద్రబాబుతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు.

పవన్ కళ్యాణ్ రెడీ...

పవన్ కళ్యాణ్ రెడీ...

జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా బిజెపి- టిడిపి కూటమి కోసం ప్రచారం చేసే అవకాశాలున్నాయి. ఈ విషయంపై చర్చించడానికి చంద్రబాబు బుధవారం ఆయనను కలిశారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారట..

జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తారట..

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈసారి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

మురళీమోహన్ పోటీ..

మురళీమోహన్ పోటీ..

రాజమండ్రి లోకసభ స్థానం నుంచి ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రచారంలో మునిగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+