రోజా, బాలయ్య: సినీ గ్లామర్ నెగ్గుతుందా? (పిక్చర్స్)

హైదరాబాద్: సీమాంధ్ర సినీ గ్లామర్ నెగ్గుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పలువురు నటీనటులు సీమాంధ్రలో పోటీ చేస్తున్నారు. సీమాంధ్రలో రేపు బుధవారం పోలింగ్ జరగనుంది. అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభా స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ ఎన్నికలకు కొత్తవారు.

కాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ నటుడు మురళీమోహన్ గత ఎన్నికల్లో ఓడిపోయారు. మరోసారి తన జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రోజా ఈసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున శాసనసభకు పోటీ చేస్తున్నారు.

హేమ అనే సినీ నటి జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, మరో సినీ నటుడు జీవి సుధాకర్ నాయకుడు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా విశాఖపట్నం జిల్లా గాజువాక శాసనసభా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వీరి జతకాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే.

ఎన్టీఆర్ వారసత్వం కోసం..

ఎన్టీఆర్ వారసత్వం కోసం..

నందమూరి హీరో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామరావు రాజకీయ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్టీఆర్‌ను గెలిపించిన హిందూపురం నుంచి ఆయన ప్రస్తుతం శానససభకు పోటీ చేస్తున్నారు.

అవుననీ కాదనీ...

అవుననీ కాదనీ...

తాను పోటీ చేస్తానని తప్పుకున్నట్లే తప్పుకుని, మళ్లీ వచ్చి తూర్పు గోదావరి జిల్లా మండపేట శాసనసభా నియోజకవర్గం నుంచి నటి హేమ పోటీ చేస్తున్నారు.

రోజా జాతకం మారేనా..

రోజా జాతకం మారేనా..

ఈసారైనా నటి రోజా జాతకం మారుతుందా అనేది ప్రశ్న. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన రోజా ఉప్పుడు చిత్తూరు జిల్లా నగరి నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు.

మురళీ మోహన్ పరిస్థితి..

మురళీ మోహన్ పరిస్థితి..

గత ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయిన మురళీ మోహన్ మరోసారి ఇప్పుడు తన జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు.

గాజువాకే నాది...

గాజువాకే నాది...

తెలుగుదేశం పార్టీలో చేరబోయి అక్కడ చోటు లేక కాంగ్రెసులోకి వచ్చి నటుడు జీవి సుధాకర్ నాయుడు గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తనది గాజువాక అని గెలుస్తానని చెబుతూ వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+