బాబు ఆశ నెరవేరేనా: ఇదీ మహేష్ బాబు... అప్పుడే ఝలక్?

చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కౌంటర్‌గా ప్రిన్స్ మహేష్ బాబు కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాంత్రాంగం చేస్తున్నట్లుగా పుకార్లు వినిపించాయి. ఇది కేవలం ప్రచారమేనని చాలామంది భావిస్తున్నారు.

మహేష్ బాబు నిజంగానే టిడిపికి అండగా నిలబడతారా? బావ, ఎంపీ గల్లా జయదేవ్ మధ్యవర్తిత్వం సఫలమవుతుందా? అంటే అంత లేదని చాలామంది భావిస్తున్నారు. అందుకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారమే ఇందుకు నిదర్శనమని, పైగా మహేష్ బాబు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటారంటున్నారు.

Mahesh Babu

మహేష్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన రాజకీయ రొంపిలోకి దిగుతారని, ఓ పార్టీకి మద్దతుగా నిలబడతారని ఆయన అభిమానులే కాదు.. ఎవరూ భావించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆ విషయాన్ని పక్కన పెడితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే తరహా ప్రచారం జరిగిందని గుర్తు చేస్తున్నారు. గల్లా జయదేవ్ గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారని తెలియగానే.. బావ మహేష్ బాబు ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం సాగింది.

మహేష్ బాబు ఇక ప్రచారం చేసినట్లేనని, బావ గల్లా జయదేవ్‌కు ప్రచారం చేస్తే, అది టిడిపికి కూడా బాగా కలిసి వస్తుందని చాలామంది భావించారు. కానీ మహేష్ బాబు మాత్రం కేవలం తన బావకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. అసలు ప్రచారం అనే అంశమే చర్చకు రాలేదు.

మహేష్ బాబు పైన నాడు జరిగిందంతా వట్టి ప్రచారమేనని నాడు తేలిపోయిందని, ఇప్పుడు కూడా ఆయన రాజకీయ రొంపిలోకి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. చంద్రబాబు.. ఎంపీ జయదేవ్ ద్వారా మంత్రాంగం నెరపినా అది సఫలం కాదని అంటున్నారు.

ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ టిడిపి తరఫున బరిలోకి దిగిన సమయంలో మాట్లాడుతూ... మహేష్ బాబు నుండి తనకు పూర్తి మద్దతు ఉంటుందని, తన రాజకీయ లక్ష్యాలు నెరవేరాలని ఆయన కోరుకుంటారని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+