Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీర విధేయ అధికారిపై జగన్ సర్కార్ చర్యలు ? కేంద్రం లేఖతో కీలక ఆదేశాలు !

ఏపీ సీఐడీ మాజీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ పై చర్యలకు కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ సర్కార్ కదలింది.

ఏపీలో 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమకు అనుకూలంగా ఉండే అధికారుల్ని కీలక స్ధానాల్లో నియమించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఓ కీలక పోస్టులో నియమించిన అధికారి.. అచ్చంగా ప్రభుత్వానికి వీర విధేయత ప్రదర్శించారు. ఈ క్రమంలో ఎన్నో విమర్శలు, ఫిర్యాదులు ఎదుర్కొన్నారు. చివరికి ఆ ఫిర్యాదుల పర్వం ఆయనపై చర్యల వరకూ వచ్చేసింది. దీంతో జగన్ సర్కార్ ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ పెరుగుతోంది.

 పీవీ సునీల్ కుమార్

పీవీ సునీల్ కుమార్

ఏపీలో నిన్న మొన్నటి వరకూ ఏపీ సీఐడీ ఛీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ కు ప్రభుత్వం తాజాగా అదనపు డీజీ హోదా కూడా ఇచ్చింది. అయితే పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆయన జీఏడీకి రిపోర్ట్ ఇచ్చి పోస్టింగ్ లేకుండా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను గతం వెంటాడుతోంది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్నట్లు భావిస్తున్న పీవీ సునీల్ పై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం.. ఆయన విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలుస్తోంది.

దీంతో ఈ విధేయ అధికారి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.

 పీవీ సునీల్ పై ఫిర్యాదులు

పీవీ సునీల్ పై ఫిర్యాదులు

పీవీ సునీల్ పై ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశారు. అలాగే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు కూడా హోంశాఖకు పలు ఫిర్యాదులు చేశారు. ఇందులో హిందువులకు వ్యతిరేకంగా క్రైస్తవ మత ప్రసంగాలు చేశారనేది ప్రధాన ఫిర్యాదు. అఖిల భారత సర్వీసు అధికారి అయి ఉండి నిబంధనలకు విరుద్ధంగా ఓ మతానికి అనుకూలంగా ప్రచారం ఎలా చేస్తారనేది ఫిర్యాదు దారుల ప్రశ్న. అలాగే భార్యపై వరకట్న వేధింపులు, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామపై సీఐడీ కస్టడీలో హింస వంటి ఫిర్యాదులు కూడా పీవీ సునీల్ కుమార్ పై ఉన్నాయి.

 జగన్ సర్కార్ కు కేంద్రం ఆదేశం

జగన్ సర్కార్ కు కేంద్రం ఆదేశం

ఐపీఎస్ అధికారి, ఏడీజీ స్ధాయిలో ఉన్న అధికారి, ప్రభుత్వానికి విధేయుడిగా ఉంటారని పేరున్న పీవీ సునీల్ కుమార్ విషయంలో కేంద్రం స్పందించదని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మిగతా ఫిర్యాదుల తరహాలోనే కేంద్రం స్పందించింది. న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీవీ సునీల్ పై తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ గతంలోనే ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో ఫిర్యాదుదారు పేర్కొన్న అంశాల్ని గుర్తుచేస్తూ వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పీవీ సునీల్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు వివరాలు అందించాలని కూడా కోరింది. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడింది

 కదిలిన జగన్ సర్కార్ ?

కదిలిన జగన్ సర్కార్ ?

ఇన్నాళ్లూ తమకు విధేయతగా వ్యవహరించిన అధికారిని కీలక స్ధానం (సీఐడీ ఛీఫ్) నుంచి బదిలీ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వని జగన్ సర్కార్.. ఇప్పుడు ఆయనపై మరిన్ని చర్యలకు సిద్దమవుతోంది. ఈ మేరకు కేంద్రానికి గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదు, దాని ఆధారంగా కేంద్రం ఇచ్చిన ఆదేశాలను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి పంపింది. ఈ మేరకు డీజీపీకి సీఎస్ జవహర్ రెడ్డి లేఖ రాశారు. పీవీ సునీల్ పై తగు చర్యలు తీసుకోవాలని ఇందులో ఆయన ఆదేశించారు. దీంతో ఇప్పుడు పీవీ సునీల్ కుమార్ విషయంలో జగన్ సర్కార్ తీసుకోబోయే చర్యలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ హయాం ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు సునీల్ విషయంలో ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+