వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పదవి రేసులోకి హరికృష్ణ వస్తారా: ఆహ్వానం.. జూ ఎన్టీఆర్ కోసం బాబు ప్రయత్నం?

ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం చక్రం తిప్పుతున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. మహానాడుకు జూనియర్ వస్తారా అనే చర్చ సాగుతోంది

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మళ్లీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కోసం చక్రం తిప్పుతున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మహానాడుకు జూనియర్ వస్తారా అనే చర్చ సాగుతోంది.

టిడిపి వారసత్వంపై హరికృష్ణ, టిడిపిల మధ్య కొన్నేళ్ల క్రితం మాటల యుద్ధం నడిచింది. అంతేకాదు, సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల మాత్రం కొంచం మౌనం దాల్చారు.

చంద్రబాబు పరిస్థితి ఇది

చంద్రబాబు పరిస్థితి ఇది

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. బిజెపి దూరం జరిగేందుకు ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి జూనియర్ పైన కన్నేసినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపించాయి. అతను 2009లో టిడిపి తరఫున ప్రచారం చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ద్వారా..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ద్వారా..

ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రేసులో పలువురు ఉన్నారు. ఈ పదవికి ఓ అధికారిని దాదాపు ఖరారు చేశారనే వాదనలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా హరికృష్ణ పేరు తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. గతంలో మళ్లీ రాజ్యసభ పదవికి హరికృష్ణ ప్రయత్నించారు. కానీ అది జరగలేదు.

హరికృష్ణ ద్వారా.. జూనియర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారా?

హరికృష్ణ ద్వారా.. జూనియర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారా?

ఇప్పుడు టిటిడి చైర్మన్ పదవి ద్వారా హరికృష్ణను మచ్చిక చేసుకొని, తద్వారా జూనియర్ ఎన్టీఆర్‌ను తమ వైపు మళ్లించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే వాదనలు చక్కెర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌ను మళ్లీ తమ వైపుకు తీసుకు వచ్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వచ్చే ఎన్నికల్లో..

వచ్చే ఎన్నికల్లో..

వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా రంగంలోకి దింపాలనే యోచనలో టిడిపి ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా జూనియర్‌ను విశాఖలో జరుగుతున్న మహానాడుకు ఆహ్వానించారని ప్రచారం సాగుతోంది. అది మచ్చిక చేసుకునేందుకే అంటున్నారు.

జూనియర్ వస్తారా?

జూనియర్ వస్తారా?

హరికృష్ణ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు. ఆయన మహానాడుకు హాజరయ్యే కావొచ్చు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా మహానాడుకు హాజరైతే చాలు అని టిడిపి వర్గాలు కూడా కోరుకుంటాయి. పార్టీ పండుగకు హాజరైతే ఆయన మద్దతు ఉన్నట్లుగానే ప్రజల్లోకి వెళ్తుంది. ప్రచారం విషయాన్ని పక్కన పెట్టవచ్చు. మరి హరికృష్ణ కొడుకును తీసుకు వస్తారా, అసలు జూనియర్ వస్తారా అనేది ప్రశ్నార్థకమే. జూనియర్ వచ్చే అవకాశాలు మాత్రం లేవని అంటున్నారు. 2012లో టిడిపి అధ్యక్ష రేసు అంశంపై నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య పోరు నడిచిన విషయం తెలిసిందే. అయితే జూనియర్ స్వయంగా రంగంలోకి దిగలేదు.

ఆశించడం అత్యాశేనా?

ఆశించడం అత్యాశేనా?

చంద్రబాబు - లోకేష్‌లు టిడిపిలో పట్టు సాధించారు. దీనిని హరికృష్ణ జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటప్పుడు మళ్లీ తన తనయుడిని టిడిపికి దగ్గర చేస్తారనుకోవడం అత్యాశే అవుతుందని అంటున్నారు. పైగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తాత స్థాపించిన పార్టీని సమర్థిస్తానని గతంలో చెప్పారు. కానీ అందులోను అసంతృప్తి కనిపించింది. కాబట్టి ఆయన చంద్రబాబుకు దగ్గరయ్యే అవకాశాలు ఉండవంటున్నారు.

English summary
Will Hero Junior NTR attend Teluguesam Party festival Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X