వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ: మామ కోసం బాబుకు ఎన్టీఆర్ షాకిస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Will Jr NTR support YS Jagan?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక మామ కోసం మరో మామకు షాక్ ఇస్తారా? వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపుతారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలయ్యతో జూనియర్‌కు దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌కు జూనియర్ మద్దతు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రచారం గతంలోను జరిగింది.

అప్పుడు జూనియర్‌కు సన్నిహితుడైన కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. దీంతో జూనియర్ టిడిపికి దూరమై జగన్‌కు దగ్గరవుతున్నారనే ప్రచారం జరిగింది. దానిని ఆ తర్వాత విలేకరుల సమావేశంలో యంగ్ టైగర్ కొట్టి పారేశారు. అయితే తాజాగా మరో ప్రచారం యంగ్ టైగర్ అభిమానులను, తెలుగు తమ్ముళ్లను గందరగోళానికి గురి చేస్తోంది.

జూనియర్‌కు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాస రావు వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గుంటూరు లోకసభ లేదా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇందుకోసం జగన్‌ను నార్నె కలిశారట.

టిక్కెట్ పైన హామీ ఇచ్చేందుకు సుముఖత చూపిన జగన్ అందుకు ఓ కండిషన్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ ఇస్తే మీ అల్లుడు జూనియర్‌తో మీ తరఫున పోటీ చేయించాలని షరతు పెట్టారట.

జగన్‌ను నార్నె కలవడం, జూనియర్‌తో ప్రచారం చేయించాలని కండిషన్ పెట్టడం ఏ మేరకు నిజమో కాని ఈ ప్రచారం ఇప్పుడు జూనియర్ అభిమానుల్లో, తెలుగు తమ్ముళ్లో ఆందోళన కలిగిస్తోందంటున్నారు.

దీంతో ఇప్పుడు జూనియర్‌ను మామ ప్రచారం కోసం ఒప్పిస్తారా? అందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటారా? అనే ప్రచారం సాగుతోంది. ఎంత అంసతృప్తి ఉన్నా జూనియర్ ప్రచారం కోసం మాత్రం ఒప్పుకోకపోవచ్చునని తమ్ముళ్లు అంటున్నారు. ప్రచారం చేస్తే మాత్రం అతనికే నష్టమనే వారూ లేకపోలేదు.

English summary
The rumors came out that Jr NTR's uncle Narne Srinivasa Rao is interested to contest from Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X