తెలుగుదేశం పార్టీలో అవమానం: చంద్రబాబుకు నటి కవిత గట్టి షాక్!
మహానాడులో తనకు అవమానం ఎదురైందని చెప్పిన టిడిపి నేత, ప్రముఖ నటి కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
విశాఖ: మహానాడులో తనకు అవమానం ఎదురైందని చెప్పిన టిడిపి నేత, ప్రముఖ నటి కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమే చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా తనకు అవమానం జరిగిందని, కాబట్టి రాజీనామాపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
మహానాడులో గతంలో ఎన్నడూ లేనివిధంగా తనను అవమానించి పంపిస్తున్నారంటూ టిడిపి ఆర్గనైజింగ్ కార్శదర్శి కవిత శనివారం ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఆమెను నిర్వాహకులు వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో ఆమె కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తనను ఎంతో గౌరవించారని తెలిపారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక తనను పక్కన పెట్టడం చాలా బాధగా ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కవిత గతంలోను పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications