గవర్నర్ విందు, సస్పెన్స్: బాబు-కేసీఆర్ చేయి కలిపేనా, ఒకేసారి వస్తారా?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (తెలంగాణ), నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్)లు మరోసారి కలుసుకోనున్నారు. గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి రాక గౌరవార్థం ఇరువురు సీఎంలకు రాజ్ భవన్‌లో విందు ఇవ్వనున్నారు.

ఈ విందుకు ఇరువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. గవర్నర్ ఇచ్చే విందుకు హాజరు కావాలని చంద్రబాబు, కేసీఆర్‌లు నిర్ణయించుకున్నారు. దీంతో, మంగళవారం నాడు మరోసారి ఇరువురు సీఎంలు గవర్నర్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమక్షంలో కలుసుకోనున్నారు.

ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వ్యవహారాలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి రాజుకున్న విషయం తెలిసిందే. ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరి పైన మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ సమయంలో చంద్రబాబు, కేసీఆర్‌లు మరోసారి ఒకే వేదిక పైన కలుసుకోపోవడం ఉత్కంఠను కలిగించే అంశమే.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఎదురుపడతారా? లేక ఎడమొహం పెడమొహం పెడతారా? చేతులు కలుపుతారా? అనే చర్చ సాగుతోంది. గతంలో గవర్నర్ ఇచ్చిన విందులోనే ఇరువురు సీఎంలు చేతులు కలుపుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. సాయంత్రం ఏడుగంటలకు విందు ఇవ్వనున్నారు.

Will KCR and Chandrababu meet?

ఒకే టైంలో వస్తారా?

గవర్నర్ ఇచ్చే విందుకు ఇరువురు ముఖ్యమంత్రులు ఒకేసారి వస్తారా అనేది కీలకమైన అంశం. కొన్నాళ్లుగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నందున వారు వేర్వేరు సమయాల్లో వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఒకే సమయంలో వస్తే కలుస్తారా, మాట్లాడుకుంటారా, ఏం మాట్లాడుకుంటారో చూడాల్సి ఉంది.

కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూలై 1వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ రోజు ఉదయం పది గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో దిగుతారు. కపిలతీర్థం, తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు.

చంద్రబాబు విదేశీ పర్యటన

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై 5 నుండి 10వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన హాంకాంగ్, జపాన్‌లలో పర్యటిస్తారు. జూలై 6,7,8 తేదీల్లో జపాన్‌లో, జూలై 9,10 తేదీల్లో హాంకాంగ్‌లో పర్యటిస్తారు.

జపాన్ ప్రధానిని అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు. టోక్యోలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. జపాన్, హాంకాంగ్‌లలో పారిశ్రామికవేత్తలతో భేటీ అయి, వారికి ఏపీలో పెట్టుబడులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+