సైకిల్ జోరుకు మహేష్ బాబు సహకరిస్తారా?

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో ప్రిన్స్ మహేష్ బాబు తెలుగుదేశం పార్టీకి సహకరిస్తాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బావ గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంటు సీటు నుంచి, బాబాయ్ ఆదిశేషగిరి రావు తెనాలి శానససభ స్థానం నుంచి పోటీ చేస్తా వారి కోసం మహేష్ బాబు ప్రచారం సాగిస్తాడనే మాట వినిపిస్తోంది. వారిద్దరికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టికెట్లు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.

నిజానికి, మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రెసు వెంట ఉండేవారు. ఆదిశేషగిరి రావు కూడా కాంగ్రెసులో పనిచేశారు. కానీ మారిన పరిస్థితిలో వారు తెలుగుదేశం వైపు మళ్లినట్లు ప్రచారం సాగుతోంది. సూపర్ స్టార్ కృష్ణ 1989 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేసి గెలిచారు. ఆరోగ్యం సహకరించడం లేదనే కారణంతో కృష్ణ రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Mahesh Babu

అయితే, సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులు మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన కృష్ణ సతీమణి విజయనిర్మల కుమారుడు నరేష్ ఇప్పుడు ఆ పార్టీతో అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల విడుదలైన 1 నేనొక్కడినే సినిమాను చూసి మహేష్ బాబును ఆకాశానికెత్తారు. ఆ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉందని ఆయన అన్నారు. నరేష్‌కు కూడా రాజకీయ ఆకాంక్షలున్నాయి.

కాగా, మహేష్ బాబు బాబాయ్, బావ పోటీ చేసే స్థానాల్లోనే ప్రచారం చేస్తారా, తెలుగుదేశం తరఫున ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేస్తారా అనేది చెప్పలేం. నిజానికి, తనకు రాజకీయాలు తెలియవని మహేష్ బాబు పలుమార్లు అన్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, ఇప్పుడు తప్పనిస్థితిలో రాజకీయ ప్రచారానికి దిగుతారని అంటున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా మహేష్ బాబు ఇమేజ్ తమకు కలిసి వస్తుందని తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి మహేష్ బాబు మద్దతు ఉందనే సంకేతాలు రాష్ట్రవ్యాప్తంగా వెళ్తాయని అంటున్నారు.

సూపర్ స్టార్ కృష్ణకు, మహేష్ బాబుకు రాష్ట్రంలో అభిమాన సంపద దండిగానే ఉంది. వారి అభిమానులు తెలుగుదేశం పార్టీ వైపు మళ్లితే తమ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+