మోడీ హవా: నాగ్, పవన్ లిస్ట్‌లో మోహన్‌బాబు చేరేనా?

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో టాలీవుడ్ నటులు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించి బిజెపికి మద్దతిస్తానని చెప్పగా, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలవనున్నారు. ఇప్పుడు అందరి చూపు మోహన్ బాబు పైన ఉంది. పవన్, నాగార్జున దారిలోనే మోహన్ బాబు నడిచే అవకాశాలు ఉన్నాయా? అనే చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 2014 సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున బిజెపిలో చేరకపోయినా, ప్రచారం చేయకపోయినా ఆ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. నాగార్జున ఏం చేస్తారనేది మోడీతో భేటీ అనంతరం తేలనుంది. ఇప్పటికే బిజెపికి మద్దతని వెంకయ్య నాయుడుకు నాగార్జున హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Will Mohan Babu joins with Pawan and Nag

రాష్ట్ర విభజన, ఎన్నికలకు ముందు ఆయా ప్రాంతీయ పార్టీల బలాబలాలు సర్వేల్లో తారుమారు అవుతండటం, మోడీ హవా, బిజెపికి రాష్ట్రంలో క్రమంగా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ నటులు ఆ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు నాగార్జున, పవన్ కళ్యాణ్‌లు ఏ పార్టీ వైపు అనేది దాదాపు తెలియదనే చెప్పవచ్చు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో మినహా పవన్ సైలెంట్‌గా ఉన్నారు. ఇక నాగార్జున పార్టీలకతీతంగా అందరిని కలుస్తుంటారు.

అయితే, ఇప్పుడు ఒక్కరొక్కరు బిజెపి వైపు చూస్తున్నారు. మోహన్ బాబు కూడా బిజెపి వైపు చూసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఓ సమయంలో మోహన్ బాబు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన త్వరలో ఏదో ఒక పార్టీలో చేరే అవకాశం లేకపోలేదంటున్నారు. అంతేకాకుండా మరో టాలీవుడ్ ప్రముఖ నటుడు కూడా బిజెపి వైపుకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.

గత ఏడాది మోడీ హైదరాబాద్ వచ్చినప్పుటు టాలీవుడ్ పరిశ్రమ ప్రముఖులు ఆయన వద్దకు క్యూ కట్టారు. అందులో మోహన్ బాబు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మోడీపై మోహన్ బాబు కుటుంబ సభ్యులు ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఉన్నాయి. పవన్ పార్టీ పెట్టి మద్దతిస్తే, నాగార్జున పార్టీలో చేరకుండా మద్దతిచ్చే అవకాశముండగా... మోహన్ బాబు ఏకంగా పార్టీలో చేరవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+