వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్య: పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి..?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనుపమా చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో సినిమాలను వదిలేస్తానని చెప్పారు. ఎప్పడనేది కచ్చితంగా చెప్పలేనని కూడా అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల వెనక మర్మమేమిటనేది చర్చనీయాంశంగా మారింది.

పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఆయన సన్నద్ధమవుతున్నారా అనే ప్రశ్న ఆ వ్యాఖ్యల కారణంగా ఉదయిస్తోంది. ఆయన జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లో కాలైతే పెట్టారు గానీ పూర్తి స్థాయిలో దానికి సమయం ఇవ్వలేకపోతున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి ఆయన సినిమాలకు స్వస్తి రాజకీయాల్లోకి దూకుతారా అనే సందేహం కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2019లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించి ఆయన ఎపిలో బిజెపి, టిడిపి కూటమికి మద్దతు ఇచ్చారు.

Will Pawan kalyan active in politics?

ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ అప్పుడప్పుడు వివిధ అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు కూడా చేశారు. అయితే, ఆయన వచ్చే ఎన్నికల్లో పాల్గొనడానికి వీలుగా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు వండర్ బాక్స్ లాంటవని కూడా ఆయన అన్నారు. దాని అంతు తేల్చడానికి ఆయన మనసు ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు.

రీల్ లైఫ్‌లో చెప్పే భారీ డైలాగులను రియల్ లైఫ్‌లో ఫాలో కాలేకపోతున్నట్లు అనిపిస్తుందని కూడా పవన్ కల్యాణ్ అన్నారు. సినిమాలు తనకు ముఖ్యం కాదని, వాటి కన్నా జీవితం ముఖ్యమని, ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో సినిమాలకు స్వస్తి చెప్పాలని అనుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని అంటున్నారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించానని ఆయన చెప్పారు. ప్రజల్లోకి వెళ్లడానికి సమయం సమీపిస్తుండడంతో ఆయన సినిమాలకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
It is said that Jana Sena chief Pawan Kalyan is planning to give full time to politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X