పుకార్లకు పవన్ కళ్యాణ్ తెర దించుతారా?

దీంతో పవన్ మౌనాన్ని అంగీకారంగా భావించాలో లేక వ్యతిరేకతగా భావించాలో ఆయన అభిమానులు, రాజకీయ నాయకు లకు అంతు చిక్కడం లేదంటూ మీడియా కథనాలు వస్తున్నాయి. మరోవైపు, టిడిపి నేతలు ఆయనకు అప్పుడే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. పవన్ వస్తానంటే మేమొద్దంటామా ? అంటూ బహిరంగంగానే స్వాగతం పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానాలను పవన్ కళ్యాణ్ తిరస్కరిస్తారా, ఆమోదిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలుగుదేశం పార్టీలో చేరితే పవన్ కళ్యాణ్ సినీ భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా పవన్ సోదరుడు, మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రాజకీయాల విషయంలో మౌనం సమాధానంగా మెలుగుతూ వస్తున్నారు.
అయితే, సినిమాల్లోగానే నిజ జీవితంలోనూ హీరోయిజం ప్రదర్శించే అలవాటు ఉన్న పవన్ రాజకీయాలలో చేరే అవకాశాలు లేవని ఆయన అభిమానాలు ట్విట్టర్‌లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా తమ అభిమాన హీరోకు రాజకీయ రంగు పులిమి సినీ కేరీర్ నాశనం చేయవద్దని కోరుతున్నారు. అసలు ఆయనకు రాజకీయాలలోకి రావాలన్న ఆలోచనే లేదనీ, ఇదంతా కేవలం ఓ వర్గం సృష్టించిన కుట్రగా వారు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications