నేడు అసెంబ్లీకి బిల్లు, అవిశ్వాసం నోటీసు తర్వాత...?

అయితే ఈ ప్రక్రియకు రాష్ట్రపతి ఎంత గడువిస్తారన్నదానిపైనే ఉత్కంఠ నెలకొంది. నలభై రోజుల సమయం ఇవ్వవచ్చునంటున్నారు. వాస్తవానికి సోమవారం నాడే ముసాయిదా బిల్లు శాసనసభ, శాసనమండలికి వస్తుందని అధికారులు భావించారు. ఇందుకు అనుగుణంగా శుక్రవారమే బిల్లును కేంద్రం రాష్ట్రపతి భవన్‌కు పంపినప్పటికీ కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయని తేలడంతో ప్రధాని కార్యాలయం దాన్ని వెనక్కు తెప్పించుకుంది.
బిల్లుకు సవరణలు చేసిన తర్వాతే సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. దానిపై న్యాయ నిపుణుల సలహా అనంతరం హోం శాఖ అధికారుల ద్వారా అసెంబ్లీకి పంపాలని రాష్ట్రపతి కార్యాలయ వర్గాలు నిర్ణయించాయి. అయితే రాష్ట్రపతి దక్షిణాఫ్రికా ప్రయాణమవుతున్న నేపథ్యంలో ఆలోపే బిల్లును ఆయన హోంశాఖకు పంపిస్తారని, అక్కడి నుంచి మంగళవారం రాష్ట్రానికి బిల్లు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు, కొందరు ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రపతి కొంత సందిగ్ధంలో పడ్డారని, షిండే వచ్చి చర్చలు జరిపాక రాష్ట్రపతి అభిప్రాయంలో మార్పు వచ్చిందంటున్నారు. ఏ క్షణంలోనైనా ముసాయిదా బిల్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి కేంద్ర హోంశాఖకు చేరే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా రాష్ట్రపతి నుంచి శాసనసభ కార్యదర్శికి బిల్లు వస్తుంది.
రాష్ట్రంలో శాసన మండలి కూడా ఉన్నందువల్ల రాష్ట్రపతి ప్రతినిధి అయిన గవర్నర్‌కు ప్రత్యేక దూత ద్వారా బిల్లు ప్రతులు చేరుతాయంటున్నారు. దీంతో దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి సభ్యుల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు గవర్నర్ పంపిస్తారు. ఉభయసభల్లోనూ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులే అధిక సంఖ్యలో ఉన్నందున మెజారిటీ అభిప్రాయం బిల్లుకు వ్యతిరేకంగానే ఉండే అవకాశాలుంటాయంటున్నారు.












Click it and Unblock the Notifications