వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ షరతు, ముందే చెప్పలేదు.. శిల్పా చక్రపాణి రెడ్డి చేరికపై ట్విస్ట్, డ్రామానా?

ఉప ఎన్నికలకు ముందు నంద్యాలలో సరికొత్త ట్విస్ట్. టిడిపికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరడంపై సందిగ్ధత కనిపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: ఉప ఎన్నికలకు ముందు నంద్యాలలో సరికొత్త ట్విస్ట్. టిడిపికి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరడంపై సందిగ్ధత కనిపిస్తోంది.

ఈ సెకన్ నుంచే, ఏం చేస్తాడనుకుంటే పిడుగు అయ్యారు: అఖిలప్రియఈ సెకన్ నుంచే, ఏం చేస్తాడనుకుంటే పిడుగు అయ్యారు: అఖిలప్రియ

గురువారం మూడు గంటలకు జగన్ నంద్యాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చక్రపాణి రెడ్డి వైసిపి కండువా కప్పుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఆయన కూడా ప్రకటన చేశారు.

జగన్ షరతు, డైలమాలో చక్రపాణి రెడ్డి

జగన్ షరతు, డైలమాలో చక్రపాణి రెడ్డి

ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి వైసిపిలో చేరితే టిడిపికి నష్టమే. ఆయన బుధవారం ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, టిడిపిపై మండిపడ్డారు. కానీ అంతలోనే పరిణామాలు మారాయి. జగన్ పెట్టిన షరతు కారణంగా చక్రపాణి రెడ్డి డైలమాలో పడ్టట్లుగా ప్రచారం సాగుతోంది.

Recommended Video

Silpa Chakrapani Reddy Visits Srisailam Temple - Oneindia Telugu
రాజీనామా చేసి రావాలి

రాజీనామా చేసి రావాలి

వైసిపిలోకి రావాలంటే టిడిపి ద్వారా వచ్చిన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని వైసిపి అధినేత జగన్ సూచించారని తెలుస్తోంది. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ స్పష్టత లేదు. కానీ జగన్ మాత్రం రాజీనామా చేసి రావాల్సిందేనని చెప్పారు.

ఈ విషయం నాకు ముందు చెప్పలేదు

ఈ విషయం నాకు ముందు చెప్పలేదు

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రావాలనే విషయం తనకు వైయస్ జగన్ ముందు చెప్పలేదని శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరులతో చెబుతున్నారని తెలుస్తోంది. తనకు ముందు చెప్పకుండా, ఇప్పుడు చెబితే ఎలాగని ఆయన ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.

అఖిలప్రియ సహా 21 మంది చేరిక వల్లే

అఖిలప్రియ సహా 21 మంది చేరిక వల్లే

వైసిపి నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. నలుగురు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా అయ్యారు. అందులో అఖిలప్రియ ఒకరు. వారు రాజీనామాలు చేయాలని వైసిపి పట్టుబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇన్నాళ్లు తాము రాజీనామా చేయమని చెప్పి, ఇప్పుడు పదవిలో ఉండగా తమ పార్టీలోకి చక్రపాణి రెడ్డిని తీసుకుంటే టిడిపి ఎదురు ప్రశ్నించే అవకాశముంది. అందుకే రాజీనామా చేసి రావాలని జగన్ షరతు విధించారని తెలుస్తోంది.

డ్రామానా?

డ్రామానా?

వైయస్ జగన్, శిల్పా చక్రపాణి రెడ్డిల మధ్య ఇప్పటికే అవగాహన కుదిరిందని, పార్టీలోకి వచ్చేందుకు ఇద్దరు ఓకే చెప్పుకున్నారని అంటున్నారు. అయితే, రాజీనామాలపై టిడిపి ఎదురు ప్రశ్నిస్తుందని తెలిసే వైసిపి.. చక్రపాణి రెడ్డితో ఇలా డ్రామా నడిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా రాజీనామా చేస్తేనే చేర్చుకోవాలని అంటున్నారు.

English summary
It is said that YSR Congress Party chief YS Jaganmohan Reddy ordered Silpa Chakrapani Reddy to resign his MLC post for joining YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X