'తెలంగాణకు బాబు లోకువ, ఎన్నికలు వస్తే టిడిపికి ఘోర పరాజయమే'

ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని, చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం ఆరోపిస్తోంది.

అమరావతి: ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని, చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం విమర్శిస్తోంది.

నంద్యాల ఉప ఎన్నికలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత ఉన్నదని తాము చెప్పిన విషయం నిజమని ప్రచారం చేయాలనుకుంటోంది.

ఎన్నికలు వస్తే టిడిపికి ఘోర పరాజయం

ఎన్నికలు వస్తే టిడిపికి ఘోర పరాజయం

చంద్రబాబు ప్రభుత్వంపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా మండిపడుతున్నాయి. తాజాగా, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చంద్రబాబుకు షాకిచ్చారు. ఎన్నికలు వస్తే టిడిపికి ఘోర పరాజయం తప్పదని వ్యాఖ్యానించారు.

ఏం జరిగినా జగన్ పైకి..

ఏం జరిగినా జగన్ పైకి..

ఏపీలో ఏం జరిగినా వైసిపి అధినేత జగన్ పైకి నెట్టివేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులకు ఫ్యాషన్‌గా మారిందని ఉండవల్లి ధ్వజమెత్తారు. ప్రపంచ బ్యాంకుకు ఎవరో ఆకాశ రామన్న ఉత్తరం రాస్తే దానికి జగన్ కారణమని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాబు నిర్మిస్తోంది అమరావతి కాదని... భ్రమరావతి అన్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం రాకుండా వైసిపి రైతుల పేరిట లేఖ రాసిందని టిడిపి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఉండవల్లి పైవిధంగా స్పందించారు.

ఐవైఆర్ కృష్ణారావుపై..

ఐవైఆర్ కృష్ణారావుపై..

బ్రాహ్మణ కార్రోపేషన్ చైర్మన్ పదవికి ఐవైఆర్ కృష్ణారావు రాజీనామా చేసి ఉంటే బాగుండేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఆయనను అనవసరంగా పదవి నుంచి తప్పింంచడం ఏమాత్రం సరికాదన్నారు. ఈ చర్య వల్ల ఐవైఆర్ కంటే చంద్రబాబుకే వంద రెట్లు నష్టం జరిగిందన్నారు. చంద్రబాబు అపాయింటుమెంట్ దొరకనందునే ఐవైఆర్ సోషల్ మీడియాను ఆశ్రయించారన్నారు. సోషల్ మీడియాకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఏపీలో కుంభకోణాలపై ఐవైఆర్‌కు అవగాహన ఉందన్నారు.

తెలంగాణకు లోకువయ్యారు..

తెలంగాణకు లోకువయ్యారు..

విశాఖ భూకుంభకోణం వివరాలు కూడా ఆయనకు పూర్తిగా తెలుసునని ఉండవల్లి అన్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వానికి లోకువ అయ్యారని మండిపడ్డారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+