బాబు పావులు: రోజాకు చెక్ చెప్పేందుకు రంగంలోకి వాణీ విశ్వనాథ్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా నిత్యం టిడిపిపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతుంటారు.ఆమె దూకుడుకు చెక్ చెప్పేందుకు టిడిపి పలు ప్రయత్నాలు చేసింది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా నిత్యం టిడిపిపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నిప్పులు చెరుగుతుంటారు. ఆమె దూకుడుకు చెక్ చెప్పేందుకు టిడిపి పలు ప్రయత్నాలు చేసింది.
అసెంబ్లీలో దారుణంగా వ్యవహరించినందుకు గాను ఆమెపై ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అలాగే, పలు సందర్భాల్లో రోజా వైసిపిని వీడుతోందంటూ మైండ్ గేమ్ కూడా ఆడారు. కానీ రోజా మాత్రం టిడిపిపై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు.

రంగంలోకి వాణీ విశ్వనాథ్
ఇదే సమయంలో ప్రముఖ నటి వాణీ విశ్వనాథ్ టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి తరం ఈ హీరోయిన్‌తో రోజాకు చెక్ పెట్టాలని టిడిపి భావిస్తోందని తెలుస్తోంది.

అలా దెబ్బ కొట్టాలని
రోజా టిడిపిపై విరుచుకుపడితే పలువురు టిడిపి నేతలు అదేస్థాయిలో రోజాపై మండిపడుతున్నారు. కానీ వాణీ విశ్వనాథ్‌ను రంగంలోకి దింపి రోజాకు రాజకీయంగా కూడా చెక్ చెప్పాలని టిడిపి భావిస్తోంది. విమర్శల రూపంలో కాకుండా సినీ గ్లామర్‌తో దెబ్బ కొట్టాలని భావిస్తోంది.

వాణీ విశ్వనాథ్‌తో చెక్
వాణీ విశ్వనాథ్‌ను పార్టీ రంగంలోకి దించింది. వాణీ విశ్వనాథ్ టిడిపిలో చేరే విషయంపై కూడా స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. త్వరలో ఆమె సైకిల్ ఎక్కనున్నారు. వాణీ విశ్వనాథ్ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

రోజాపై పోటీ చేయించేందుకు టిడిపి పావులు
దీంతో టిడిపి అధిష్టానం వాణీ విశ్వనాథ్‌ను నగరి నుంచి పోటీ చేయించేందుకు పావులు కదుపుతోందని తెలుస్తోంది. రోజాకు గట్టి కౌంటర్ ఇచ్చే మహిళా నేతలు పార్టీలో తక్కువగానే ఉన్నారని అధిష్టానం భావిస్తోంది. ఎమ్మెల్యే అనిత, మాజీ మంత్రి పీతల సుజాత వంటి ఒకరిద్దరు రోజాకు కౌంటర్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు గ్లామర్‌ను గ్లామర్‌తోనే కొట్టాలని టిడిపి చూస్తోందంట.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications