వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా?.. మంత్రి లోకేశ్ షాకింగ్ కామెంట్స్
సింగపూర్ పర్యటన సక్సెస్ అయినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని అన్నారు. తాము ఎంవోయూలు చేయట్లేదని.. నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని వివరించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందాలు, ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు, మద్యం కుంభకోణం.. తదితర అంశాలపై మాట్లాడారు.
తాము అభివృద్ధి చేస్తూంటే.. మాజీ సీఎం జగన్ అడ్డుపడుతున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీలోనే ఉందన్నారు. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసే వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అరెస్ట్ అవుతారా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. మంత్రి లోకేశ్ షాకింగ్ సమాధానం చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
"మేమంతా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరుగులు పెడుతోంటే.. వైఎస్ జగన్ తప్పుడు ఈ-మెయిల్స్ పెట్టిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏపీలోనే ఉంది. ఏపీ బ్రాండ్ దెబ్బ తీసే వ్యక్తులు ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఓ లిక్కర్ కంపెనీ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు చేస్తుందా? లిక్కర్ కంపెనీకి బంగారం ఏమన్నా ముడిసరుకా..? అదాన్ డిస్టలరీ కంపెనీ నుంచి పీఎల్ ఆర్ కంపెనీకి డబ్బులు ఎందుకు వెళ్లాయి..? దీనికి పెద్దిరెడ్డి సమాధానం చెప్పగలరా..? రాజ్ కెసిరెడ్డి ఆ డబ్బులు నావి కాదన్నాడంటే.. జగన్ రెడ్డివి అని చెప్పాడని అర్థం చేసుకోవాలి అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
మరోవైపు రాజకీయ లబ్ధి కోసమే కొందరు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిని ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ అడ్డుకోలేదని.. బనకచర్ల విషయంలో మిగులు జలాలనే తాము వాడుకుంటున్నామన్నారు. ఏ అనుమతులు అడిగి కాళేశ్వరం కట్టారు ? నదుల అనుసంధానం దేశానికి ఎంతో అవసరమని.. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ టీడీపీ అని తెలిపారు.

అంతేకాక నంద్యాలలో కానిస్టేబుల్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. అలాగే కియా పరిశ్రమ వద్ద మంత్రి సవిత అనుచరుల ఆందోళనపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులను ఎవరు భయపెట్టాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications