జ‌గ‌న్ ఆలోచ‌నలు: కూలుతున్న టీడీపీ నేత‌ల పునాదులు: విశాఖ‌లో క‌ల‌క‌లం..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాల‌తో టీడీపీ నేత‌ల పునాదులు కూలుతున్నాయి. తాజాగా విశాఖ‌లో టీడీపీ ప్ర‌ముఖ నేత‌ల ఆక్ర‌మ‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆ వెంట‌నే అధికారుల ఆదేశాల మేర‌కు వారి అక్ర‌మ నిర్మాణాలు కూల్చేసారు. ఇందులో టీడీపీ ప్ర‌ముఖులు మాజీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌తో పాటుగా సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు..టీడీపీకే చెందిన మ‌రి కొంద‌రు నేత‌ల బిల్డింగ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఇది టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. దీని పైన టీడీపీ నేత‌లు ఆరా తీస్తున్నారు.

విశాఖ‌లో టీడీపీ నేత‌ల ఆక్ర‌మ‌ణ‌ల తొలిగింపు..
అక్ర‌మ నిర్మాణాలు ఎక్క‌డ ఉన్నా..ఎవ‌రివైనా కూల్చేయాలంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశించ‌టంతో..గ్రేట‌ర్ విశాఖ అధికారులు అప్పుడే ఆచ‌ర‌ణ‌లో పెట్టేసారు. టీడీపీ ముఖ్య నేత మాజీ ఎంపీ ముర‌ళీ మోహ‌న్‌కు చెందిన ఓ నిర్మాణం పైన అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్లాన్‌ లేకుండా నిర్మించిన జయభేరి ట్రూ వ్యాల్యూ కార్‌ షోరూమ్‌ను టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చేశారు.

With CM Jagan directions Vizag Muncipal corporation Officials demolished ex MP Murali Mohan encroached buildings

Recommended Video

    విద్యుత్ బకాయిల సంగతేంటి- దేవినేని ఉమ

    ఎంవీపీ సెక్టార్‌-11లో గల వెయ్యి గజాల స్థలంలో ప్లాన్‌ లేకుండా కొంతకాలం కిందట షెడ్‌ ఏర్పాటుచేసి అందులో షోరూమ్‌ నడుపుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత కార్ల క్రయవిక్రయాలు జరుగు తున్నాయి. దీనికి ప్లాన్‌ లేదని గుర్తించిన జోన్‌-2 టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సీసీపీ విద్యుల్లత దృష్టికి తీసుకువెళ్ల గా ఆమె కమిషనర్‌ జి.సృజనకు తెలియజేశారు. తక్షణం దానిని కూల్చేయాలని కమిషనర్‌ ఆదేశించడంతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది యంత్రాలతో వ‌చ్చి వాటిని తొలగించారు.

    గంటాకు చెందిన క్యాంపు కార్యాల‌యం సైతం..
    అదే స‌మ‌యంలో మాజీ మంత్రి..సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావుకు చెందిన క్యాంపు కార్యాల‌యం పైన గ్రేట‌ర్ విశాఖ అధికారులు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారు. గంటా శ్రీనివాస రావు మంత్రిగా ఉన్న స‌మ‌యం నుండి క్యాంపు కార్యా ల‌యం వినియోగిస్తున్నారు. జోన్‌-1 ప‌రిధిలోని భీమిలో ఉన్న గంటా క్యాంపు కార్యాల‌యానికి ఎలాంటి ప్లాన్‌లతో పాటు గా అనుమ‌తులు లేన‌ట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా జోన్‌-2 పరిధి ద్వారకానగర్‌లో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కు చెందిన భవనం ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించినట్టు గుర్తించారు.

    వీటిని అధికారులు కూల్చి వేయాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఈ నేత‌ల‌కు స‌మాచారం ఇచ్చారు. త‌మ‌కు స‌మ‌యం కావాల‌ని గంటా కోరిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదే ర‌కంగా విశాఖ న‌గ‌రంలో ఇత‌ర ప్రాంతాల్లో ఎక్క‌డైతే అక్ర‌మ నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలిగించాల‌ని క‌మిష‌న‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. ఇప్పుడు విశాఖ‌తో ప్రారంభ‌మైన కూల్చివేత వ్య‌వ‌హారం ఇంకా ఎక్క‌డి వ‌ర‌కు కొన‌సాగుతుందో చూడాలి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+