ఇది కదా ఫ్యానిజం అంటే..: సంబరాల్లో జపాన్ గుడ్డిగా మునిగిపోకుండా

ఫిఫా వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. మెక్సికో, అమెరికా, స్కాట్లాండ్, దక్షిణ కొరియా, జర్మనీ, స్వీడెన్ వంటి టైటిల్ హాట్ ఫేవరెట్ జట్లు విజయం సాధించాయి. గెలిచి తీరుతాయనుకున్న స్విట్జర్లాండ్, కెనడా, ఖతర్, జపాన్.. వంటివి డ్రాతో సరిపెట్టుకున్నాయి. గ్రూప్ బీలో డ్రా అయిన మ్యాచ్ ల సంఖ్య అధికం. ఇందులో ఉన్న నాలుగు జట్లన్నీ కూడా తమ ప్రత్యర్థులతో జరిగిన మ్యాచ్ లల్లో సమవుజ్జీలుగా నిలిచాయి. అత్యంత టఫ్ ఉందీ గ్రూప్ లో.

తాజాగా అమెరికా డల్లాస్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో జపాన్- నెదర్లాండ్స్ హోరాహోరీగా తలపడ్డాయి. గ్రూప్ ఎఫ్ లో భాగంగా జరిగిన మ్యాచ్‌ ఇది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరును జపాన్ 2-2తో డ్రా చేసుకుంది. ఈ రసవత్తర పోరులో నెదర్లాండ్స్ దూకుడును జపాన్ విజయవంతంగా అడ్డుకోగలిగింది. మ్యాచ్‌లో రెండుసార్లు డచ్ టీమ్ ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ.. జపాన్ ఆటగాళ్లు నిలువరించగలిగారు. అద్భుత పోరాట పటిమను కనబరిచి స్కోరును సమం చేశారు.

Japan Fans Steal the Show Again as Cleaning Dallas Stadium After FIFA Match vs Netherlands Goes Viral

నెదర్లాండ్స్ కెప్టెన్ విర్గిల్ వాన్ డిక్ రెండో అర్ధభాగంలో తొలి గోల్ చేయగా, ఆరు నిమిషాల వ్యవధిలోనే జపాన్ ఫార్వర్డర్ కీటో నకమురా అద్భుతమైన గోల్ కొట్టి జపాన్‌కు ఈక్వలైజర్ అందించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ తరఫున క్రిసెన్సియో సమ్మర్‌విల్లే మరో గోల్ నమోదు చేశాడు. అయినప్పటికీ.. సంతోషం లేకుండా పోయిందా జట్టుకు. మ్యాచ్ ముగిసే చివరి నిమిషాల్లో దైచీ కమడ కొట్టిన గోల్ తో జపాన్ మళ్లీ స్కోర్ ను సమం చేసింది. దీంతో గ్రూప్ ఎఫ్‌లో ఉన్న ఈ ఇరు జట్లు కూడా పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత జపాన్ అభిమానులు చూపిన చొరవ అద్భుతం అనిపించింది. ఆదర్శప్రాయంగా నిలిచింది. సాధారణంగా ఇలాంటి పెద్ద క్రీడా ఈవెంట్లలో ప్రేక్షకులు కూర్చునే స్టాండ్స్ అన్నీ తినుబండారాల ఖాళీ ప్యాకెట్లు, ప్లాస్టిక్ కప్పులతో నిండిపోతాయి. డల్లాస్ స్టేడియంలోనూ అదే సీన్ కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా జపాన్ ఫ్యాన్స్ స్టేడియం ఖాళీ చేయకుండా అక్కడే ఉండిపోయారు.

అందరూ వెళ్లిపోయాక.. స్టేడియంలో ఉన్న చెత్త మొత్తాన్నీ క్లీన్ చేశారు. తమతో పాటు తెచ్చుకున్న ప్లాస్లిక్ బ్యాగ్ లల్లో స్టేడియంలల్లో వాటిని నింపి బయటికి తీసుకెళ్లారు. స్టేడియం మొత్తాన్ని కూడా పరిశుభ్రంగా మార్చిన తర్వాతే అక్కడి నుండి ప్రయాణం అయ్యారు. ఇటువంటి బాధ్యతాయుత ప్రవర్తన జపాన్ అభిమానులకు కొత్తేమీ కాదు. 2022 ఖతార్, 2018 రష్యా, 1998లో ఫ్రాన్స్‌లో టోర్నీల్లోనూ జపాన్ అభిమానులు స్టేడియాలను శుభ్రం చేసి ప్రశంసలు అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+