అర్ధరాత్రి చింతమనేని వీరంగం. నడిరోడ్డుపై ఊగిపోతూ, అరుస్తూ.. : Video

దెందులూరు తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ఆయన సృష్టించిన హల్‌చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది. తన సొంత పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే లక్ష్యంగా చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడికి యత్నించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఏకంగా పొక్లెయిన్ల్ (JCB) వెంటబెట్టుకుని లాయర్ ఇంటి ముందుకు వెళ్లిన ఎమ్మెల్యే, అక్కడ బీభత్సం సృష్టించారు.

TDP MLA Chintamaneni Prabhakar Creates Midnight Ruckus and Attacks Lawyer House with Pokclain in Eluru

'చంపేస్తా.. వాడో నేనో తేలాలి' అంటూ వార్నింగ్

ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్న సమయంలో భారీ అనుచర గణంతో లాయర్ శ్రీనివాసబాబు ఇంటి ముట్టడికి దిగిన చింతమనేని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. రోడ్డుపై నిలబడి ఊగుతూ, అరుస్తూ.. "వాడో నేనో తేలిపోవాలి.. చంపేస్తా!" అంటూ బహిరంగంగా ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు దిగారు. తాను ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా మరిచిపోయి, పోలీసుల సమక్షంలోనే వార్నింగ్‌లు ఇవ్వడం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. వీడియో వైరల్!
ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. వీడియో వైరల్!

కూతురు బతిమాలినా వినని ఎమ్మెల్యే.. డీఎస్పీతో వాగ్వాదం

ఈ హైడ్రామా నడుస్తున్న సమయంలో చింతమనేనిని శాంతింపజేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. "వద్దు నాన్న ప్లీజ్.. వెళ్లిపోదాం" అంటూ ఆయన కుమార్తె ఎంత వేడుకున్నా, చింతమనేని కరిగిపోలేదు. "నన్ను ఆపుతారేంటి?" అంటూ ఏకంగా డీఎస్పీతోనే తీవ్ర వాగ్వాదానికి దిగారు. దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఏలూరు వీధుల్లో ఈ పొలిటికల్ హై టెన్షన్ వాతావరణం కొనసాగింది.

చింతమనేని Vs అబ్బయ్య చౌదరి - ముదురుతోంది..!!
చింతమనేని Vs అబ్బయ్య చౌదరి - ముదురుతోంది..!!

చింతమనేనికి ఇది కొత్తేమీ కాదు.. వివాదాల చరిత్ర!

చింతమనేని ప్రభాకర్ ఇలాంటి అరాచకాలకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన తీరు పలుమార్లు వివాదాస్పదమైంది. ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం, పోలీసులను బెదిరించడం, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు చేయడం ఆయనకు పరిపాటిగా మారింది.

గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళా తహసీల్దార్‌ (వనజాక్షి) పై అనుచరులతో కలిసి దాడి చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా పోలీసులను నిలదీయడం, కుల దూషణల కేసుల్లో ఇరుక్కోవడం వంటి అనేక సంఘటనలతో ఆయన నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా సొంత పార్టీ నేత ఇల్లే లక్ష్యంగా, అదీ పొక్లెయిన్లతో అర్ధరాత్రి నడిరోడ్డుపై చింతమనేని చేసిన వీరంగం చూస్తుంటే.. ఆయన తన పాత పద్ధతిని మార్చుకోలేదని స్పష్టమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+