చులకన అయిన పవన్: ఫేస్ వాల్యూ జీరో: టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లకే జీహుజూర్ అనాల్సిందే
TDP-Janasena alliance: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టే- అవి అంచనా వేసినట్టే- కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను అలవోకగా అందుకుంది. భారత్ రాష్ట్ర సమితి కంచుకోటలను సైతం తుక్కు తుక్కు చేసింది.
తొలి రౌండ్ నుంచే హస్తం పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి సహా పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. కొడంగల్లో రేవంత్ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, భారత్ రాష్ట్ర సమితికి చెందిన పట్నం నరేందర్ రెడ్డిని మట్టికరిపించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన అడ్రస్ గల్లంతయింది. ఈ పార్టీ అభ్యర్థులందరూ దాదాపుగా డిపాజిట్లను సైతం దక్కించుకోలేకపోయారు. ఎనిమిది చోట్ల జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే.. అన్ని చోట్లా ఓడిపోయారు. కనీసం గట్టి ప్రతిఘటన సైతం ఇవ్వలేకపోయారు.
ఇది.. ఏపీలో తెలుగుదేశం పార్టీ-జనసేన మధ్య పొత్తుపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేనను పట్టుకుని ఏపీలో రాజకీయాలు చేయలేం అనే అభిప్రాయం ఈ పార్టీ నేతల్లో వ్యక్తమౌతోందప్పుడే. పవన్ కల్యాణ్కు ఉన్న ఫేస్ వాల్యూ ఏ మాత్రం కూడా తెలంగాణలో ప్రభావం చూపలేకపోయిందంటూ బాహటంగా చెబుతున్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనక చంద్రబాబు హస్తం ఉందని భావిస్తున్నారా ..??#Chandrababu #RahulGandhi #RevanthReddy #TelanganaAssemblyElectionResults2023 #ElectionResults #ElectionResults2023 #AssemblyElections2023 #ResultsWithOneindia #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) December 3, 2023
అలాంటిది- టీడీపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించగలదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పొత్తు పెట్టుకున్నందున తప్పక జనసేనను కలుపుకొని వెళ్లాల్సి వస్తోందని, భారమే అయినప్పటికీ భరించక తప్పదని భావిస్తోన్నారు టీడీపీ నేతలు.
అదే సమయంలో- తెలంగాణలో చవి చూసిన పరాజయం వల్ల టీడీపీ దృష్టిలో చులకన అయ్యే పరిస్థితి ఏర్పడింది పవన్ కల్యాణ్కు. సీట్ల కేటాయింపు విషయంలో ఎంత మాత్రం గొంతెత్తి డిమాండ్ చేయలేని దుస్థితిలోకి నెట్టేసింది. టీడీపీ ఎన్ని సీట్లను ఇస్తే అన్ని సీట్లకు జీ హుజూర్ అనాల్సిన వాతావరణాన్ని కల్పించింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications