బ్రాహ్మణి నుంచి బాబు పేద వరకు, లోకేష్ వందల కోట్ల బోగస్ లెక్క: సాక్షి కౌంటర్, మిథున్ సవాల్

Recommended Video

    బ్రాహ్మణి నుంచి బాబు పేద వరకు, బోగస్ లెక్క: సాక్షి కౌంటర్, మిథున్ సవాల్ | Oneindia Telugu

    హైదరాబాద్: ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ శుక్రవారం తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆస్తుల ప్రకటన అంతా బూటకమని ఆ పార్టీ ఏంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. మీ ఆస్తుల వివరాలు ఎవరూ అడగడం లేదని కౌంటర్ ఇచ్చారు.

    లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటిస్తూ వైసీపీ అధినేత జగన్ తన ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రకటించకుండా తమను నిలదీయడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

    లోకేష్ సిద్ధమా

    లోకేష్ సిద్ధమా

    ఆస్తుల వివరాలు ఎవరూ అడగడం లేదని మిథున్ రెడ్డి చెప్పారు. లోకేష్ ప్రకటించిన ఆస్తుల కంటే రెండు రెట్లు ఇచ్చి కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే చందాలు వేసుకొని మరీ లోకేష్ ఆస్తులు కొంటామని, వాటిని ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. ఈ సవాల్‌కు లోకేష్ సిద్ధమా అని నిలదీశారు.

    లోకేష్ లెక్కలు అంతా బోగస్ అని..

    లోకేష్ లెక్కలు అంతా బోగస్ అని..

    ఎవరూ అడగకపోయినా నారా కుటుంబం ఆస్తులు ప్రకటిస్తూ డ్రామాలు ఆడుతోందని వైసీపీ అధినేత వైయస్ జగన్ పత్రిక సాక్షి పేర్కొంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను వంద కోట్ల లోపే చూపిస్తూ, పైగా మార్కెట్ విలువ అంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం లోకేష్ చేశారని పేర్కొంది.

     వందల కోట్ల హైదరాబాద్ ఆస్తులపై ఇలా

    వందల కోట్ల హైదరాబాద్ ఆస్తులపై ఇలా

    జూబ్లీహిల్స్‌లో వందల కోట్ల విలువైన ఇంటి గురించి మాట మాత్రం చెప్పకుండా, మదీనాగూడలోని కొన్ని వందల కోట్లు విలువ చేసే పదెకరాల భూమి విలువను రూ.73 లక్షలుగా చూపించారని పేర్కొంది. ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా రూ.300 కోట్ల ఆస్తులను చూపించిన లోకేష్ ఇప్పుడు కేవలం రూ.15 కోట్లు అని చెప్పడం ఆశ్చర్యకరమే అని పేర్కొంది.

    భువనేశ్వరి, బ్రాహ్మణి ఆస్తుల పైనా..

    భువనేశ్వరి, బ్రాహ్మణి ఆస్తుల పైనా..

    తల్లి భువనేశ్వరి పేరిట పంజాగుట్టలో ఉన్న ఇల్లు, తమిళనాడులోని కోట్ల విలువైన భవనాలు, భూముల ప్రస్తావన లేదని పేర్కొంది. భార్య బ్రాహ్మణి పేరుమీద జూబ్లీహిల్స్, మణికొండ, చెన్నైలో ఉన్న వందల కోట్ల ప్లాట్లు, ప్లాట్ల విలువ కూడా తప్పుడు లెక్కలతో కూడినవి అని పేర్కొంది. అన్నింటికి మించి ఆ కుటుంబంలో చంద్రబాబు నికర ఆస్తి రూ.2.53 కోట్లుగా ప్రకటించి అత్యంత పేద వ్యక్తి తన తండ్రేనని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశారని పేర్కొంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+