అత్తింటి వేధింపులతో ఆత్మహత్యాయత్నం, ప్రియురాలిపై మోజుపడ్డాడని ఫ్రెండ్ హత్య

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అత్తింటి వేధింపులతో ఓ మహిళ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తాను ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురంలో చోటు చేసుకుంది. అత్తా - కోడళ్లకు మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పిల్లలకు ఆ తల్లి ఎలుకల మందు తినిపించిందని తెలుస్తోంది. ఈ సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది.

మత్తు మందు ఇచ్చి ఆభరణాలు అపహరణ

విజయనగరం జిల్లా జామి మండలం అన్నవరాజుపేటలో ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి ఆభరణాలను అపహరించిన సంఘటన జరిగింది. ఆభరణాలు అపహరించిన వ్యక్తి గోపయ్యగా గుర్తించారు. అతనికి గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Woman Attempts Suicide in Kurnool district

ఏపీ రాజధాని ప్రాంతంలోని ఆలయంలో చోరీ

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ ప్రధాన తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఆలయాన్ని చిన్న తిరుపతిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇటీవలే ఈ ఆలయాన్ని టిటిడి స్వాధీనం చేసుకుంది. ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిన వెంటనే తుళ్లూరు పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. జాగిలాల సహాయంతో నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. రాజధాని ప్రకటన తర్వాత అనంతవరం ఆలయానికి భక్తుల రాక పెరిగింది. ఈ నేపథ్యంలో హండీలో ఎంత సొమ్ము చోరీ అయ్యిందో సరిగా అంచనా వేయలేకపోతున్నారు.

ప్రియురాలిపై మోజు పడ్డాడని చంపేశారు

తన ప్రియురాలిపై మోజుపడ్డాడన్న ఆగ్రహంతో సూర్య మోహన్ అనే యువకుడిని స్నేహితుడే హతమార్చిన సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసుల విచారణలో ఇది వెల్లడైంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీ చెందిన లింగమయ్య, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలూం శింగారం గ్రామానికి చెందిన సూర్యమోహన్‌లు స్నేహితులు.

ఇరువురూ ఆళ్లగడ్డ ప్రాంతంలో కారు దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నారు. లింగమయ్య ప్రియురాలు క్రిష్ణవేణిపై సూర్యమోహన్‌ మోజుపడ్డాడు.

విషయం తెలుసుకున్న లింగమయ్య అతని స్నేహితుడు అవతార్‌తో కలసి నంద్యాల రోడ్డులో సూర్యమోహన్‌ను హత్య చేశారు. ఇనుపరాడ్‌తో తలపై కొట్టి, కత్తితో గొంతుకోసి వేటకొడవలితో మెడపై నరికి చంపారు. పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి వేటకొడవలి, రాడ్‌, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+