పని పేరుతో రూంకి రమ్మన్న వ్యక్తిని కుమ్మేసిన మహిళ!

ఇంట్లో పని చేస్తుండగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆయన మాట తీరును గమనించిన సదరు కూలికి వచ్చిన మహిళ అతనిని చితకబాదింది. రోడ్డు మీద కొట్టుకుంటూనే తీసుకు వచ్చి పోలీసు స్టేషన్‌లో అప్పగించింది. పోలీసులు మహిళ ఫిర్యాదును తీసుకున్నారు.
మల్లేష్ అనే వ్యక్తి తన ఇంట్లో పని ఉందని చెప్పి పిలుచుకు వెళ్లాడని, అతను తన భర్త స్నేహితుడేనని, పని కోసం ఇంటికి వెళ్లాక ఇవాళ పని లేదని, డబ్బులు తీసుకొని తాగి రూంకు రావాలని చెప్పాడని బాధితురాలు ఆరోపించారు.
పిజి కాలేజీలోకి దూసుకెళ్లిన కారు
హైదరాబాదులోని ప్యారడైజ్ దగ్గర ఓ కారు పిజి కళాశాలలోకి దూసూకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు.
షోరూంలో అగ్ని ప్రమాదం
అనంతపురం జిల్లా ఆర్ఎఫ్ రోడ్డులో ఉన్న సుజుకీ షోరూంలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు.
గ్యాస్ లీకేజ్
అమలాపురం మండలం రంగాపురంలో ఓఎన్‌జిసి రిగ్ 29కి అనుబంధంగా ఉన్న ఓ సైట్లో గ్యాస్ పైపు లీకైంది. గ్యాస్ విరజిమ్మడంతో వచ్చిన ధ్వని, వాసనకు గ్రామస్థులు భయాందోళనకు లోనయ్యారు. మరమ్మతులు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications