వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో కేరళ సనీ తార ఫొటో: టెక్కీని బుట్టలో వేసిన యువతి, ఇలా ఎందరో...

కేరళ నటి ఫొటో ఫేస్‌బుక్‌లో పెట్టి యువకులను పెళ్లి దాకా లాగి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువతి బండారం బయటపడింది. ఓ టెక్కీని మోసం చేయడం వల్ల అది వెలుగులోకి వచ్చింది.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ఫేస్‌బుక్‌లో కేరళ సినీ తార ఫొటో పెట్టి యువకులను వలలోకి లాగుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్‌లో కేరళ సినీ నటి ఫొటో పెట్టి యువకులకు ఆమె ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. ఆ తర్వాత వారితో పరిచయం పెంచుకుని చాటింగ్ చేస్తుంది.

అతను దారిలోకి వచ్చాడని గుర్తించిన తర్వాత ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదిస్తుంది. దాంతో ఆమెను స్వయంగా కలిసిన తర్వాత ఫేస్‌బుక్‌లో ఫొటో బూటకమని గుర్తించి దూరమైన యువకులను బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది. ఇలా ఓ యువతి రాష్ట్రంలోని పలువురు యువకులను మోసం చేస్తోంది.

Woman cheats posing Kerala actress photo in Facebook

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన ఓ యువకుడికి కూడా ఇదే పరిస్థితి ఎదురైన నేపథ్యంలో ఆమె బాగోతం బయటపడింది. ఈపురుపాలేనికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫ్రెండ్‌ రిక్వె్‌స్టలో అందమైన యువతి ఫొటోను చూశాడు. రిక్వె్‌స్టను ఓకే చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాటింగ్‌ ప్రారంభమైంది.

కొద్ది రోజుల తర్వాత 'నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లిచేసుకుందాం' అంటూ ఆ యువతి నుంచి అతడికి ప్రతిపాదన వచ్చింది. తన తండ్రి డీఎస్పీ అని, తనకు ఇద్దరు అన్నయ్యలున్నారని, వారిద్దరూ అమెరికాలోని ఇంజనీర్లుగా పనిచేస్తున్నారని ఆమె అతనితో చాటింగ్‌లో చెప్పింది. కుటుంబ నేపథ్యం కూడా బాగుండటంతో ఆ యువకుడు పెళ్లికి అంగీకరించాడు.

వారిద్దరు ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కలుసుకున్నారు. ఫేస్‌బుక్‌లో ఫొటోకు తనను కలిసిన యువతికి పోలికలు లేకపోవడంతో అతడు కంగు తిన్నాడు. ఆమెను నిలదీశాడు. దీంతో తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తూ డబ్బులు కూడా డిమాండ్‌ చేయసాగింది. ఆ యువకుడు విషయాన్ని ఇంట్లో చెప్పడంతో వారు హైదరాబాద్‌ వెళ్లి యువకుడిని తీసుకొచ్చారు.

దాంతో ఆగకుండా ఆ యువతి - నాలుగు రోజుల క్రితం ఆ యువకుడు తనను మోసం చేశాడంటూ ఆ యువతి ఈపూరుపాలెం పోలీసు స్టేషన్‌లో అట్రాసిటీ కేసు పెట్టింది. దాంతో ఆమె తనను మోసం చేసి, బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బు డిమాండ్‌ చేస్తోందని, చంపిస్తానని బెదిస్తోందని ఆదివారం పోలీసులకు అతను ఫిర్యాదు చేశాడు.

ప్రకాశం జిల్లాలోని వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ఆమె తన తండ్రి డీఎస్పీ అని ఇచ్చిన ఫోన్ నంబర్‌ ఒంగోలులో పని చేస్తున్న ఓ డీఎస్పీదని తేలింది. ఆయనకూ ఆమెకూ సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు.

English summary
A girl of Prakasam district of Andhra Pradesh is cheating men, posting Keral actress image in facebook and blackmailing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X