భార్య పిలుస్తుందని తీసికెళ్లి మహిళపై రేప్: సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ

విజయనగరం: తన భర్త స్నేహితుడే తనను లొంగదీసుకోవడానికి ఓ ప్రబుద్ధుడు అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టడంతో మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భార్య పిలుస్తుందంటూ తన ఇంటికి తీసుకుని వెళ్లి మహిళపై అత్యాచారం చేసి, సెల్‌ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. ఆ చిత్రాలను మిత్రులకు షేర్ చేశాడు. ఆ రకంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రామభద్రాపురంలో శనివారంనాడు చోటు చేసుకుంది. ఆ మహిళ ప్రస్తుతం విజయనగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

వివరాలు ఇలా ఉన్నాయి - గుడిపల్లి శ్రీను అనే వ్యక్తి తన మిత్రుడి భార్యను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, తన సెల్‌ఫోన్ ద్వారా అతను ఆమెకు సంబంధించిన అశ్లీల చిత్రాలు తీశాడు. వాటిని బయటపెట్టడంతో ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గుడిపల్లి శ్రీను అనే ఆ కామాంధుడు తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని ఆ మహిళ ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో చెప్పింది. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

Woman commits suicide in Vijayanagaram district

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించిన గుడిపల్లి శ్రీను గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు మొబైల్‌ఫోన్‌లో తీసిన చిత్రాలను ఫ్రెండ్స్‌కు షేర్‌ చేశాడు. విషయం తెలిసిన బాధితురాలు పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించి కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాగుడు మాన్పించలేక ఆత్మహత్య

విజయనగరం జిల్లాలోనే మరో దారుణం జరిగింది. జిల్లాలోని వేపాడ మండలం కృష్ణరాయుడిపేట గ్రామంలో గంప సుజాత (30) అనే వివాహిత ఉరేసుకుని మరణించింది. భర్త పక్కా తాగుబోతు. తాడుగు మాన్పించడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. అయినా అతను తాగడం మానలేదు. దాంతో ఆమెకు జీవితంపై విరక్తి కలిగింది. ఆ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+