బైక్‌పై యువతితో అసభ్యకరంగా జవాన్, '100'తో సేఫ్

బాధితురాలి కథనం మేరకు... ఆమె బాలాజీనగర్‌లో నివసిస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా బోయిన్‌పల్లిలోని తన ఇంట్లో వంట కోసం మంగళవారం సాయంత్రం రావాలని సదరు జవాను ఆమెకు చెప్పాడు.
మంగళవారం సాయంత్రం ఇంటికి తీసుకు వెళ్లేందుకు అతను బాధితురాలిని బైక్ పైన ఎక్కించుకున్నాడు. అయితే, ఆమె బైక్ ఎక్కిన తర్వాత అతను తాగి ఉన్న విషయాన్ని గుర్తించింది. బైక్ పైన వెళ్తుండగా అతను కొంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశాడు. అనంతరం అంతగా జన సంచారం లేని ప్రాంతంలో బైక్ నిలిపి.. ఈ రోజు తనతో కలిసి ఉండేందుకు సిద్ధమా అని అడిగాడు.
ఆమె వెంటనే బైక్ పై నుండి దిగడంతో అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అలర్ట్ అయిన ఆమె డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే సరికి నిందితుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేశారు. బుధవారం ఉదయం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతనిని బుధవారం సాయంత్రం కోర్టులో ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications